జె తెలంగాణాకు జైలు

నిజామాబాద్‌: తెలంగాణా జిల్లాల్లో జెడ్‌పిటిసి, ఎంపిటిసి స్థానాలకు ఏకగ్రీవంగా ఎన్నికైన తెలంగాణా రాష్ట్ర సమితి అభ్యర్ధులను పోలీసులు అరెస్టు చేసి జైల్లో పెడుతున్నారు. నిజామాబాద్‌ జిల్లాలో ఏకగ్రీవంగా డజను స్థానాలను టిఆర్‌ఎస్‌కు కట్టబెట్టిన గ్రామ కమిటీలపై పోలీసులు కేసు నమోదు చేసి 24 మందిని అరెస్టు చేశారు.

రెండు నెలల ప్రత్యేక తెలంగాణా ఉద్యమంలో జరిగిన అరెస్టులు ఇవే కావడం గమనార్హం. ముఠాకక్షలు, రాజకీయ వైషమ్యాలకు నిలయమైన రాయలసీమలో అనేక చోట్ల తమ అభ్యర్ధులను ఏకగ్రీవంగా గెలిపించుకుని దానిని తమ ఘనతగా చెప్పుకుంటున్న తెలుగుదేశం ప్రభుత్వం టిఆర్‌ఎస్‌ అభ్యర్ధుల ఏకగ్రీవ ఎన్నికను మాత్రం తప్పుపడుతున్నది. టిఆర్‌ఎస్‌కు అండగా నిలిచిన గ్రామాలపైకి తెలుగుదేశం ప్రభుత్వం పోలీసులను ఉసిగొల్పుతున్నదని టిఆర్‌ఎస్‌ నేతలు ఆరోపిస్తున్నారు. ఏకగ్రీవ ఎన్నికలపై ప్రజలనుంచి, ప్రతిపక్షాలనుంచి ఫిర్యాదులు లేకున్నా పోలీసులు ఏకపక్షంగా కేసులు నమోదు చేయడం వెనక తెలుగుదేశం హస్తం వున్నదని వారు స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+