వికాస్ సింగ్ భారత్‌కు అప్పగింత
ఇస్లామాబాద్:శాంతి సందేశంతో సైకిల్ పై ప్రపంచయాత్ర ప్రారంభించి పాకిస్తాన్‌కు బందీగా చిక్కిన భారతీయుడు వికాస్‌సింగ్‌ను గురువారం నాడు పాకిస్తాన్ ప్రభుత్వం భారత అధికారులకు అప్పగించింది. ముషారఫ్ భారత పర్యటనకు ముందుగా ఉభయ దేశాల మధ్య సుహృద్భావ వాతావరణం ఏర్పాటుకు జరుగుతున్న కృషిలో భాగంగా ముషారఫ్ ఆదేశాల మేరకు వికాస్‌సింగ్‌ను విడుదల చేశారు.
సరైన పత్రాలు లేకుండా తమ దేశంలో ప్రవేశించాడని ఆరోపిస్తూ వికాస్‌ను పాకిస్తాన్ పోలీసులు పెషావర్‌లో అరెస్టు చేయడానికి ముందుగా ఆయన దాదాదు 62 దేశాలను చుట్టబెట్టారు. వీసాకోసం విఫలప్రయత్నం చేసి తెగించి పాకిస్తాన్‌లో అడుగుపెట్టిన వికాస్‌ను బంధించిన పాకిస్తాన్ ప్రభుత్వం మూడేళ్ల పాటు జైల్లో వుంచాల్సిందిగా ఆదేశించింది.
ఇదిలా వుండగా ముషారఫ్ పర్యటనకు సానుకూల వాతావరణం కల్పించే లక్ష్యంతో భారత జైళ్లలో వున్న 400 మంది పాకిస్తానీ ఖైదీలను భారత్ విడుదల చేసింది. ప్రధాని వాజ్‌పేయి ఆదేశాల మేరకు విడుదల చేసిన ఈ ఖైదీలను వాగ్ సరిహద్దు వద్ద పాక్ సైనికాధికారులకు అప్పగించారు. భారత్ చర్యకు ప్రతిగానే వికాస్‌సింగ్ విడుదలకు పాకిస్తాన్ నిర్ణయించింది. అయితే పాక్ జైళ్లలో మగ్గుతున్న మరో 300 మంది భారతీయ ఖైదీల విషయం మాత్రం పాకిస్తాన్ ప్రస్తావించలేదు.












Click it and Unblock the Notifications