అమర్‌నాథ్ యాత్ర లో హైదరాబాదీ మృతి
శ్రీనగర్: అమర్‌నాథ్ యాత్రకు బయలుదేరిన ఆంధ్రప్రదేశ్ యాత్రికుడొకరు బుధవారం రాత్రి గుండెపోటుతో మరణించారు. ఆయనను సికింద్రాబాద్‌కు చెందిన ఎస్ జనార్ధన్‌గా గుర్తించారు. 3718 కిలోమీటర్ల ఎత్తైన శేష్‌నాగ్ పర్వతంపై ఆక్సిజన్ సకారంలో అందక ఆయన మృతి చెందారు. జనార్ధన్ గుండెనొప్పి అని చెప్పగానే వైద్య సహాయాన్ని రప్పించారని అయితే ఈ లోగానే ఆయన మరణించారని అధికారులు తెలిపారు.
దక్షిణ కాశ్మీర్ హిమాలయాల్లోని అమర్‌నాథ్ గుహల్లో సహజసిద్ధంగా ఏర్పడిన మంచు శివలింగాన్ని గురువారం ఉదయానికి 9,100 మంది పైగా భక్తులు దర్శించుకున్నారు. గత నెల రెండునుంచి అమర్‌నాథ్ యాత్ర ప్రారంభమైన విషయం విదితమే.












Click it and Unblock the Notifications