ఆంధ్ర ఎంఎస్‌కు యుజిసి చుక్కెదురు
హైదరాబాద్: అమెరికా తరహాలో ఈ ఏడాది నుంచి రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో ఎంఎస్ కోర్సు ప్రారంభించాలని రాష్ట్రప్రభుత్వం చేసిన సన్నాహాలకు యుజిసి నుంచి చుక్కెదురైంది. డిగ్రీ స్థాయిలో బిఐటి, బిఐఎస్సీ పేరుతో కొత్త కోర్సులను, పీజీ స్థాయిలో ఎంఎస్ కోర్సులను ప్రారంభించాలని ఆంధ్రప్రదేశ్‌లోని విశ్వవిద్యాలయాలు, ఉత్తరభారతంలోని మరికొన్ని విశ్వవిద్యాలయాలు సన్నాహాలు చేస్తున్నాయి.
అయితే కొత్త పేర్లతో గందరగోళం సృష్టించడం సమంజసం కాదని కోర్సులు కొత్తవి ప్రవేశపెట్టాలనుకున్న పాత పేర్లనే ఉపయోగించుకోవాలని యుజిసి, దేశంలోని విశ్వవిద్యాలయాలకు సలహా ఇచ్చింది. బిఎస్సీ ఐటి, బికాం ఐఎస్, లేదా ఎంఎస్సీ ఐటి, ఎంకామ్ ఐఎస్సీ పేరుతో డిగ్రీ, పీజీ స్థాయిల్లో కొత్త కోర్సులను ప్రారంభించడంలో నష్టమేమిటని యుజిసి నిలదీసింది. డిగ్రీ, పిజి స్థాయిలో రకరకాల పేర్లతో పట్టాలను ప్రధానం చేయడం గందరగోళానికి దారితీస్తుందని యుజిసి స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications