శివాజీగణేషన్ కన్నుమూత
చెన్నై: ప్రముఖ సినీ నటుడు శివాజీ గణేషన్ సోమవారం సాయంత్రం కన్ను మూశారు. ఆయన గుండెపోటుతో, మూత్ర పిండాల వ్యాధితో బాధపడుతూ ఆస్పత్రిలో చేరారు. ఆయన ఆస్పత్రిలోనే తుది శ్వాస విడిచారు. ఆయన 1928లో జన్మించారు. కొన్ని దశాబ్దాల పాటు ఆయన తన నటన ద్వారా తమిళ, తెలుగు ప్రేక్షకులను అలరించారు.
ఆయన తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు. వందలాది తెలుగు చిత్రాల్లో ఆయన నటించారు. ఆయన తమిళ సినిమాలెన్నో తెలుగులోకి డబ్ అయి తెలుగు ప్రేక్షకులను అలరించాయి. ఆయన నటనకు తెలుగులో జగ్గయ్య కంచుకంఠం తోడై గాంభీర్యాన్నిచ్చింది. సినీ రంగానికి ఆయన చేసిన సేవకు గాను ఆయనకు దాదా సాహెబ్ పాల్కే అవార్డు లభించింది. ఆయనను పద్మశ్రీ, పద్మవిభూషణ్‌లతో ప్రభుత్వం సత్కరించింది.
శివాజీ గణేషన్- నటదిగ్గజం నివాళి....












Click it and Unblock the Notifications