సిపిఎంపై సిపిఐ బాణాలు
హైదరాబాద్:కాంగ్రెస్, ఇతర వామపక్షాలతో పొత్తు వల్ల ప్రాదేశికఎన్నికల్లో తాము నష్టపోయామని భారత కమ్యూనిస్టు పార్టీ(సిపిఐ) రాష్ట్ర కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డిఅన్నారు. ఖమ్మం, నల్లగొండ, కరీంనగర్‌జిల్లాల్లో తమ మిత్రపక్షమైన సిపిఎం కూడా తమనునష్టానికి గురి చేసిందని ఆయన మంగళవారంవిలేకరుల సమావేశంలో అన్నారు.
తెలుగుదేశం, బిజెపిలనుఓడించాలనే తమ అవగాహనకు ప్రాదేశికఎన్నికల్లో తీవ్ర విఘాతం కలిగిందని ఆయనఅన్నారు. కాంగ్రెస్ మాత్రమే కాకుండా సిపిఎం కూడా తమకు పలుచోట్ల సహకరించలేదని ఆయన అన్నారు.
స్థానికంగా పొరపాట్లు జరిగినమాట వాస్తవమేనని సిపిఎం కార్యదర్శి బి.వి. రాఘవులుఅంగీకరించారు. అయితే, గతం గురించి ఆలోచించకుండా భవిష్యత్తులో ఐక్యంగాముందుకు పోవడానికి తగిన కార్యాచరణనురూపొందించుకోవడం అవసరమని ఆయన అన్నారు. మొత్తంమీద ఉభయ కమ్యూనిస్టుల మధ్య ప్రాదేశిక ఎన్నికలు విభేదాలుసృష్టించాయి.












Click it and Unblock the Notifications