సంస్థాగతంలో ప్రజాస్వామ్యం ఖూనీ
హైదరాబాద్‌ః సంస్థాగత ఎన్నికల్లో అధికార తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బి.వి. రాఘవులు విమర్శించారు. అధికారం కోసం తెలుగుదేశం పార్టీ విలువలను పక్కకు నెట్టి రౌడీలా వ్యవహరిస్తే అంతర్గత కుమ్ములాటలతో కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోలేక పోయిందని ఆయన విమర్శించారు. రెండు రోజులు జరిగే సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు మంగళవారం హైదరాబాద్ లో ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా బి.వి. రాఘవులు విలేకరులతో మాట్లాడారు.
కేవలం అధికారం కోసం నియమాలను పక్కనపెట్టి కొన్ని చోట్ల కాంగ్రెస్ వారు తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారని ఆయనవిమర్శించారు. కాంగ్రెస్ కు ప్రజలు అనుకూలంగా ఓటు చేస్తే అంతర్గత కుమ్ములాటలతో వారు ఆ అవకాశాన్ని చేజార్చుకున్నారని రాఘవులు దుయ్యబట్టారు. సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో రాష్ట్రంలో నెలకొన్ని వర్షాభావ పరిస్థితులపై చర్చించనున్నట్లు ఆయనవివరించారు.












Click it and Unblock the Notifications