పాక్ చర్చలుకొనసాగుతాయి: పిఎం
న్యూఢిల్లీ:పాకిస్థాన్‌తో చర్చల ప్రక్రియ కొనసాగుతుందని ప్రధానిఅటల్ బిహారీ వాజ్‌పేయి చెప్పారు. పాకిస్థాన్ అధ్యక్షుడుపర్వేజ్ ముషారఫ్‌తో జరిగిన ఆగ్రా శిఖరాగ్ర సదస్సుపైఆయన మంగళవారం లోకసభలో ఒక ప్రకటనచేశారు. పాకిస్థాన్ సీమాంతర ఉగ్రవాదంపై చర్చకునిరాకరిస్తూ, కాశ్మీర్‌ను మాత్రమే పట్టుకుని వేళ్లాడడంవల్ల ఆగ్రా శిఖరాగ్ర సదస్సు చర్చలు విఫలమయ్యాయనిఆయన చెప్పారు.
ఆగ్రా శిఖరాగ్రసదస్సు నేపథ్యాన్ని, చర్చల వివరాలను, జాయింట్‌డిక్లరేషన్ గురించి ఆయన తనప్రకటనలో వివరించారు. పాకిస్థాన్ అధ్యక్షుడుపర్వేజ్ ముషారఫ్ కాశ్మీర్ సమస్యపై మాత్రమేచర్చించాలని పట్టుబట్టడం వల్ల ఉమ్మడిఒప్పందంపై సంతకాలు చేయలేకపోయామనిఆయన చెప్పారు. ఈ విషయంలో రాజీ పడాల్సిన అవసరంలేదని తన మంత్రివర్గ సహచరులు అభిప్రాయపడ్డారనిఆయన చెప్పారు.
ఆగ్రా శిఖరాగ్రసదస్సులో పాక్, భారత్‌ల మధ్య చర్చనీయాంశాలపై ఒకఅవగాహనకు వచ్చినట్లు ఆయన తెలిపారు. ఈ స్థితిలోపాక్, భారత్‌ల మధ్య ద్వైపాక్షిక చర్చలుకొనసాగుతాయని ఆయన చెప్పారు. కాశ్మీర్‌లో పవిత్రయుద్ధం పేర అమాయకులను పొట్టన పెట్టుకుంటున్నారనిఆయన విమర్శించారు.
ప్రధానిప్రకటనపై ప్రతిపక్షాలు అసంతృప్తి వ్యక్తంచేశాయి. వాజ్‌పేయి ప్రకటన ఆత్మరక్షణ ధోరణిలో మాత్రమేఉన్నదని కాంగ్రెస్ నాయకురాలు మార్గరెట్ ఆల్వా విలేకరులతోఅన్నారు. కనీస అవగాహన లేకుండా ప్రభుత్వంపాకిస్థాన్‌తో చర్చలకు సిద్ధపడిందని ఆమె విమర్శించారు. సీమాంతర తీవ్రవాదంపైపాకిస్థాన్ అంగీకరించబోదని ప్రభుత్వానికి ముందే తెలిసి వుండాలని ఆమె అభిప్రాయపడ్డారు. ఆగ్రా శిఖరాగ్రసదస్సులో పాక్, భారత్‌ల మధ్య ఏ విషయాల్లోఏకాభిప్రాయం కుదిరిందో ప్రధాని చెప్పకపోవడాన్ని ఆమె తప్పుపట్టారు.












Click it and Unblock the Notifications