రాజీనామా చేయను:సిన్హా
న్యూఢిల్లీ: తన రాజీనామాడిమాండ్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి యశ్వంత్‌సిన్హా తిరస్కరించారు. యుటిఐ యుఎస్ 64 స్కీమ్‌నిలిపివేసినందుకు బాధ్యత వహిస్తూ రాజీనామాచేయాలని మంగళవారం రాజ్యసభలో ప్రతిపక్షాలుయశ్వంత్ సిన్హాను డిమాండ్ చేశాయి. ఈడిమాండ్‌ను యశ్వంత్ సిన్హా త్రోసిపుచ్చారు.యుటిఐ యుఎస్ 64 విక్రయాలను నిలిపివేయాలని ప్రభుత్వంఆదేశాలు జారీ చేయలేదని, యుటిఐయే వాటివిక్రయాలను నిలిపివేసిందని, నిలిపివేసినవిషయాన్ని ప్రభుత్వానికి తెలియజేయలేదనిఆయన వివరణ ఇచ్చారు. ఈ విషయం జూన్ 30వ తేదీన మాత్రమే తమదృష్టికి వచ్చిందని ఆయన చెప్పారు.
యుఎస్ 64 స్కామ్‌బయట పడిన నేపథ్యంలో సుబ్రహ్మణ్యంచేత రాజీనామా చేయించామని, దర్యాప్తునకు త్రిసభ్య కమిటీనివేశామని ఆయన చెప్పారు. జనవరి నుంచియుఎస్ 64 విక్రయాలు కొనసాగుతాయని ఆయనచెప్పారు.
యుఎస్ 64 విక్రయాలనిలిపివేతకు బాధ్యత వహిస్తూ ఆర్థిక మంత్రియశ్వంత్ సిన్హా రాజీనామా చేయాలనే ప్రతిపక్షాలడిమాండ్‌ను మన్నించాల్సిన అవసరం లేదని బిజెపి పార్లమెంటరీ పార్టీఅభిప్రాయపడింది. పార్లమెంటరీ పార్టీసమావేశంలో ఆగ్రా శిఖరాగ్ర సదస్సు కూడా చర్చకువచ్చినట్లు మల్హోత్రా విలేకరులకుచెప్పారు.












Click it and Unblock the Notifications