టెగర్ల దాడి -12విమానాలు ధ్వంసం
కొలంబోః తమిళ పులులు మరోసారి విజృంభించాయి. కొలంబో లోని ప్రధాన వైమానిక స్థావరంపై మెరుపు దాడి నిర్వహించి కనీసం 14విమానాలను ధ్వంసం చేశారు. గ్రెనైడ్లు, రాకెట్ లాంచర్లతో కనీసం 20 మంది టైగర్లు సోమవారం రాత్రి కొలంబోవిమానాశ్రయంపై దాడి జరిపారు. నాలుగు ప్రయాణికుల వాహనాలతో పాటు మొత్తం 12విమానాలు టైగర్ల కోపాగ్నిలో దగ్ధమయ్యాయి.
ఈ సందర్భంగా 8 మంది టైగర్లను కాల్చి చంపినట్లు శ్రీలంక పోలీసులు తెలిపారు. కొద్ది కాలంగా వెనక్కు తగ్గిన టైగర్లు ఒక్కసారిగా ఇలా విరుచుకుపడడం ఆశ్చర్యం కలిగించింది.విమానాశ్రయానికి సమీపంలో సైనిక స్థావరం కూడా వుండడంతో భద్రతా దళాలను అప్రమత్తం చేశారు.
ఈ పరిణామాల కారణంగా కొలంబో విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. కొలంబోలో దిగాల్సినవిమానాలను చెన్నయ్, తిరువనంతపురం కు తరలిస్తున్నారు.












Click it and Unblock the Notifications