లోక్ సభలో యు.డి.ఐ. దుమారం
న్యూఢిల్లీః లక్షలాది మంది ఇన్వెస్టర్లవిశ్వాసాన్ని దెబ్బతీసిన యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా కుంభకోణంపై చర్చ జరపాలంటూ ప్రతిపక్షాలు పట్టుపట్టడంతో లోక్ సభలో పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. మంగళవారం లోక్ సభ సమావేశం అయిన వెంటనే యు.టి.ఐ. కుంభకోణంపై చర్చ జరపాల్సిందిగా ప్రతిపక్షాలు పట్టుపట్టాయి. ప్రశ్నోత్తరాల సమయాన్ని పక్కన పెట్టి కీలకమైన ఈ అంశంపై చర్చించాలని ప్రతిపక్షాలు రభస సృష్టించాయి. సభ్యులు అరుపులు కేకల మధ్య కొద్ది సేపు పార్లమెంటులో ఏం జరుగుతున్నదో అర్ధం కాని పరిస్థితి ఏర్పడింది.
ఆ అంశం గురించి తరువాతవివరంగా చర్చిద్దామంటూ స్పీకర్ జి.ఎం.సి. బాలయోగి చేసినవిజ్ఞప్తుల్ని సభ్యులు పెడచెవిన పెట్టారు. దీనితో లోక్ సభ కార్యక్రమాల ప్రత్యక్ష ప్రసారాన్ని కొద్దిసేపు నిలిపి వేయాల్సిందిగా స్పీకర్ ఆదేశించారు.
కొద్ది సేపటి తరువాత ప్రతిపక్షాలు శాంతించాయి. దీనితో ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని యధావిధిగా నిర్వహించారు. 70 వేల కోట్లు రూపాయల ఆస్తులు వున్న యు.టి.ఐ. నిర్వహణఅస్తవ్యస్తంగా మారిందంటూ కాంగ్రెస్ సారధ్యంలోని ప్రతిపక్షాలు వాజ్‌పేయి ప్రభుత్వాన్ని నిలదీశాయి.












Click it and Unblock the Notifications