త్రాగునీటికోసం 86కోట్లు
హైదరాబాద్ : త్రాగునీటికోసం తీవ్ర ఇబ్బందులనెదుర్కొంటున్న 22 జిల్లాల ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం 86 కోట్ల రూపాయలను కేటాయించినట్టు రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖా మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. తక్షణం 22 కోట్లు డుదల చేస్తున్నట్టు మంత్రి ప్రకటించారు.
రాష్ట్రంలోని 22 జిల్లాలలో ప్రజలు త్రాగునీటి కోసం సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆయన
ప్రజల త్రాగునీటి సమస్యను తీర్చేందుకు ప్రజలు అన్ని చర్యలూ తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు.
గ్రాdుణ ప్రాంతాలలో మంచినీటి సదుపాయాల కల్పనకు ఈ సంవత్సరం 511 కోట్ల రూపాయలను కేటాయించామని మంత్రి తెలిపారు. రానున్న 5సంవత్సరాలలో 5వేల కోట్ల రూపాయలతో గ్రాdుణప్రాంతాలలో త్రాగునీటి సదుపాయాలను మెరుగుపరచాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు ఆయన పేర్కొన్నారు. నాలుగు జిల్లాలలో 160 కోట్ల రూపాయల వ్యయంతో త్రాగునీటి సదుపాయంకోసం చేపట్టిన పైలెట్ ప్రాజెక్టులు సత్పలితాలను ఇస్తున్నాయని మంత్రి వరించారు.
ఇదిలావుండగా, రాష్ట్రంలో ప్రజలు త్రాగునీటికి అల్లాడుతున్న నేపద్యంలో ప్రభుత్వం త్రాగునీటి సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక నిధులను కేటాయించకుండా, సాధారణ నిధులతోనే సరిపెడుతున్నదని సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి బి.. రాఘవులు ఆరోపించారు.












Click it and Unblock the Notifications