స్తంభించిన పార్లమెంట్:వాయిదా
న్యూఢిల్లీ: ఫూలన్ దేవి హత్య ఉదంతంపై సమాజ్‌వాది పార్టీ ఎంపీలు శుక్రవారం నాడు లోక్‌సభ కార్యకలాపాలను స్తంభింజేశారు. ఫూలన్ హత్యపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ ఈఅంశంపై సభలు చర్చ జరపాలని వారు డిమాండ్ చేశారు. ప్రశ్నోత్తరాల సమయం మగిసిన తర్వాత ఈఅంశాన్ని లేవనెత్తాలని స్పీకర్ బాలయోగి పదేపదేవిజ్ఞప్తి చేసిన వారు పట్టించుకోలేదు.
అరుపులు, కేకలు, నినాదాలతో సభ మధ్యలోకి దూసుకుని వచ్చారు. వారిని అదుపుచేయడం అసాధ్యం కావడంతో సభను మధ్యాహ్నం రెండింటివరకు వాయిదా వేస్తున్నట్టుగాస్పీకర్ బాలయోగి ప్రకటించారు. ఉత్తరప్రదేశ్‌అసెంబ్లీకి త్వరలో జరుగనున్న ఎన్నికల దృష్ట్యా ఫూలన్ హత్యను రాజకీయఅస్త్రంగా మార్చుకోవాలనే దీక్షతో సమాజ్‌వాద్ పార్టీ వుంది.అందుకే ఫూలన్‌దేవి బంధువులు ఎంతగా అభ్యంతర పెడుతున్నా వినకుండా ఎస్‌పి నేత ములాయం సింగ్ యాదవ్ ఫూలన్ అంత్యక్రియలను అమె నియోజకవర్గ కేంద్రమైనమిర్జాపూర్‌లో నిర్వహించారు.












Click it and Unblock the Notifications