వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
భారత ఖైదీల విడుదల
ఇస్లామాబాద్: బలూచిస్తాన్ ద్వారా పాకిస్తాన్‌లోకి అక్రమంగా ప్రవేశించిన నేరంపై పాకిస్తాన్ జైళ్లలో మగ్గుతున్న 31 మంది భారతీయ ఖైదీలను విడుదల చేసేందుకు నిర్ణయించినట్టుగా పాకిస్తాన్ గురువారం నాడు ప్రకటించింది. ఈ 31 మందిని ఇంటర్నేషనల్ బై యాద్‌గార్ దరసిసొసైటీకి చెందినవారుగా భావిస్తున్నామని పాక్ అధికారులు చెప్పారు.
వీరికి సంబంధించిన అధికారిక ప్రయాణ పత్రాలను భారత ప్రభుత్వంఅందించిన వెంటనే వారిని విడుదల చేస్తామని ఆయన చెప్పారు. పాకిస్తాన్ అధ్యక్షుడుపర్వేజ్ ముషారఫ్ ఆగ్రాలో భారత ప్రధాని వాజ్‌పేయితో శిఖరాగ్ర చర్చల్లో పాల్గొన్న తర్వాత ఖైదీల విడుదలను ప్రకటించడం ఇది రెండోసారి. మొదటి విడద సైకిల్‌పైకి ప్రపంచ యాత్రకు బయలుదేరి జైలుపాలైన వికాస్‌సింగ్‌ను పాక్ విడుదల చేసిన విషయంవిదితమే.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!