ఎన్‌ఆర్‌ఐల కంపెనీ సిస్కో టేకోవర్
న్యూయార్క్ ః ఎన్‌ఆర్‌ఐలు ప్రమోట్ చేసిన అలెగ్రో సిస్టమ్స్ ఐఎన్‌సి. ని సిస్కో సిస్టమ్స్ టేకోవర్ చేసింది. 18 కోట్ల డాలర్ల ఇన్వెస్ట్‌మెంట్‌తో ఆలెగ్రోను సిస్కో కైవసం చేసుకున్నది. వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్‌ను డెవలప్ చేయడంలో నిమగ్నమైన ఆలెగ్రో సిస్టమ్స్‌ను టేకోవర్ చేయడం వల్ల సిస్కో ప్రస్తుత విపిఎన్ సామర్ధ్యం పెరుగుతుంది.
అంతే కాకుండా సుదూర ప్రాంతాల్లోని శాఖలు, కార్యాలయాలతో కనెక్ట్ అయి వున్న సంస్థల కనెక్టివిటీ సెక్యురిటీ అవసరాలను కూడా అలవోకగా తీర్చగల అవకాశం లభిస్తుంది. అలెగ్రో సిస్టమ్స్ విపిఎన్ ఆక్సెలరేషన్ టెక్నాలజీస్‌ను హై బాండ్‌విడ్త్ నెట్‌వర్క్స్‌కు అనుకూలంగా డిజైన్ చేశారు. అలెగ్రో సిస్టమ్స్‌ను గత ఏడాదే ప్రవాస భారతీయులు మనూమూర్తి, అశ్వత్థ నాగరాజ్ ప్రమోట్‌చేశారు.












Click it and Unblock the Notifications