రాజేంద్రసింగ్ కు మెగసెసే
న్యూఢిల్లీః రాజస్థాన్ కు చెందిన సంఘసేవకుడు రాజేంద్ర సింగ్ కు రామన్ మెగసెసే అవార్డు లభించింది. ఆసియా నోబెల్ బహుమతిగా చెప్పుకొనే ఈ అవార్డును 2001 సంవత్సరానికి గాను రాజేంద్ర సింగ్ కు ఇస్తారు. రాజస్థాన్ లో మంచి నీటి నిర్వహణ లోవిశేష కృషి చేసినందుకు గాను ఈయనకు ఈ అవార్డు లభించింది.
రాజేంద్ర సింగ్ తో పాటు చైనాకు చెందిన ఇద్దరికి, జపాన్, ఇండొనేసియా, కాంబోడియా, శ్రీలంకకు చెందిన వివిధ రంగాలలోవిశేష కృషి చేసిన ప్రముఖులకు మెగసెసే అవార్డును సోమవారం ప్రకటించారు.












Click it and Unblock the Notifications