భారత్ హాకీ సారధి హైదరాబాద్ ముఖేష్
హైదరాబాద్‌ః కౌలాలంపూర్ లో జరగనున్న హాకీ టోర్నమెంట్ లో పాల్గొనే భారత జట్టుకు హైదరాబాద్ ఆటగాడు నందనూరి ముఖేష్ కుమార్ సారధ్యం వహించనున్నాడు. ఆగస్టు 2 నుంచి 12వ తేదీ వరకు జరిగే ఈ టోర్నమెంట్ లో పాల్గొనే 12 మంది సభ్యుల బృందాన్ని ఆదివారం ప్రకటించారు. లష్కర్ -ఎ-తోయిబా నుంచి బెదిరింపులు వచ్చాయంటూ శిక్షణా శిబిరంలో పాల్గొనని ధన్ రాజ్‌పిళ్ళై కి జట్టులో స్థానం లభించలేదు.
రైటవుట్‌ఆటగాడిగా జట్టులో కీలక పాత్ర పోషించే ముఖేష్‌కుమార్ మూడు ఒలంపిక్ పోటీలలో ముఖేష్‌భారత్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.1970 లో సికింద్రాబాద్ లో జన్మించిన ముఖేష్1998లో ఆసియాడ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.భారత్ హాకీకి ముఖేష్ అందిస్తున్న సేవలకుగుర్తింపుగా భారత్ ప్రభుత్వం ఆయనకు అర్జునఅవార్డు ప్రదానం చేసింది.












Click it and Unblock the Notifications