విశాఖలో ఫారెస్ట్ గెస్ట్ హౌస్‌పేల్చివేత
విశాఖపట్నంఃవిశాఖపట్నం జిల్లా ఆర్వీనగర్ లోని ఫారెస్టు గెస్ట్ హౌస్ నుపీపుల్స్ వార్ నక్సలైట్లు ఆదివారం వేకువజామునపేల్చి వేశారు. అత్యంత శక్తివంతమైన డైనమైట్లతో నక్సలైట్లు ఈ గెస్ట్ హౌస్ ను ధ్వసం చేశారు. పోలీసుల దమనకాండకు నిరసనగా నక్సలైట్లు ఈ చర్యకు పాల్పడినట్లు భావిస్తున్నారు. నక్సలైట్లు దుశ్చర్యలో ఫారెస్ట్ గెస్ట్ హౌస్ రికార్డులు, ఫర్నిచర్ ధ్వసం అయ్యాయి. గెస్ట్ హౌస్ భవనం పాక్షికంగా దెబ్బతిన్నది.
వరంగల్ జిల్లా ఏటూరు నాగారం పోలీస్టేషన్ సమీపంలోపీపుల్స్ వార్ మారణ కాండ సాగించి 24 గంటలు తిరగక ముందేవిశాఖ జిల్లాలో ఫారెస్ట్ గెస్ట్ హౌస్ ను పేల్చి వేయడంవిశేషం.












Click it and Unblock the Notifications