ఫూలన్ కేసులో మరో ముగ్గురుఅరెస్టు
న్యూఢిల్లీ: సమాజ్‌వాది ఎంపి, మాజీ బందిపోటు రాణి ఫూలన్ దేవి హత్య కేసులో ప్రధాన నిందితుడు పంకజ్ సహచరులుగా భావిస్తున్న మరో ముగ్గురు వ్యక్తులను కూడా పోలీసులు అరెస్టు చేశారు. శేఖర్, రవీందర్, రాజ్‌వీర్‌లను ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు.ఈ ముగ్గురు ఫూలన్ హత్యలో పంకజ్‌కు సహకరించినట్టుగా ఆరోపణలున్నాయి. యుపిలోని షహరాన్‌పూర్‌లో వారిని అరెస్టు చేసినట్టుగా పోలీసులు చెప్పారు.
షహరాన్‌పూర్‌లో న్యాయస్థానం ఎదుట లొంగిపోవడానికి వారు ప్రయత్నించగా న్యాయమూర్తి తిరస్కరించారు. అయితే వారి లొంగిపోవడానికి అనుమతించాలని నిందితుల తరఫు న్యాయవాదులు గట్టిగా పట్టుబట్టారు. అయితే న్యాయమూర్తి నిందితులకోసం యుపిలో పోలీసులు గాలించడం లేదని వారు ఢిల్లీలోని న్యాయస్థానం ముందు లొంగిపోవడం ఉచితంగా వుంటుందని స్పష్టం చేశారు.
కోర్టుహాలు నుంచి బయటకు రాగానే ఈ ముగ్గురిని పోలీసులుఅరెస్టు చేశారు. ఇదిలా వుండగా ఫూలన్ హత్యపై సమగ్ర న్యాయవిచారణ జరిపించాలని లేదా సిబిఐకి కేసునుఅప్పగించాలని పూలన్ భర్త ఉమేద్ సింగ్‌కోరారు. ఆయన సోమవారం నాడు ప్రధాని వాజ్‌పేయిని, హోం మంత్రి అద్వానీని కలుసుకుని ఈ మేరకువిజ్ఞప్తి చేశారు. ఫూలన్ కేసులో పోలీసులు నిజాలు బయటపెట్టడం లేదని ఉమేధ్ ఆరోపించారు.












Click it and Unblock the Notifications