జలపాతంలో 8 మంది గల్లంతు
ఎచ్చెర్ల మండల ఉపాధ్యక్షుడి హత్య
శ్రీకాకుళంః శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండల ఉపాధ్యక్షుడుకె. పోలినాయుడు ఆదివారం రాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. కాంగ్రెస్ పార్టీకి చెందిన పోలినాయుడు ఆదివారం రాత్రి ఫరీద్‌పేట వెళుతుండగా ప్రత్యర్థులు కాపుకాచి దారుణంగా హత్య చేశారు. ప్రత్యర్థులు 55 ఏళ్ళ ఉపాధ్యక్షుడు శరీరానని రెండు ముక్కలుగా నరికి వేశారు. సుమారు ఒకటిన్నర దశాబ్దికాలంగా తెలుగుదేశం పార్టీకిపెట్టని కోటగా వున్న ఎచ్చర్లలో మొన్న జరిగిన ప్రాదేశిక ఎన్నికల్లో పోతినాయుడు గెలుపొందాడు.
చాలాకాలంగా ఈ మండలంలో తెలుగుదేశం, కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ప్రాదేశిక ఎన్నికల పోలింగ్ సమయంలో కూడా ఇరువర్గాలు ఘర్షణ పడ్డాయి. పాత కక్షల కారణంగానే పోతినాయుడు హత్య జరిగి వుంటుందని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications