పెరిగిన వరంగల్ మృతుల సంఖ్య
హైదరాబాద్: వరంగల్ జిల్లా ఏటూరు నాగారంలో ఆదివారం నాడు పీపుల్స్‌వార్ నక్సలైట్లు సృష్టించిన విధ్వంసకాండలో మరణించినవారి సంఖ్య అయిదుకు పెరిగింది. సంఘటనలో తీవ్రంగా గాయపడిన గుడిపూజారి శ్యామసుందర శర్మ, ఫారెస్ట్ గార్డ్ రాజమౌళి వరంగల్ ఆస్పత్రిలో సోమవారం నాడు మరణించారు. సుమారు రెండు వందల మంది పీపుల్స్ వార్ నక్సలైట్లు భారీ ఎత్తున బాంబులు, ఫిరంగులతో ఏటూరు నాగారం పోలీసు స్టేషన్‌పై దాడి చేసిన విషయం విదితమే.
ఈ దాడికి ముందుస్టేషన్ పక్కనే వున్న గుడిలోకి వెళ్లి పూజారి నుంచి తీర్థప్రసాదాలను కూడా నక్సలైట్లుస్వీకరించారు. అంతలోని విధ్వంసానికి తెగబడ్డారు. రెండు ట్రాక్టర్లలో తెచ్చిన బాంబులనుపేల్చారు. ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. శ్యామసుందరశర్మను హెలీకాప్టర్‌లో వరంగల్ ఆస్పత్రికి తరలించినప్పటికీ లాభం లేకపోయింది. ఈ సంఘటన తర్వాత పోలీసులు బలగాలు, రాపిడ్ యాక్షన్ ఫోర్స్ దళాలు, ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగడంతో ఏజెన్సీ ప్రాంతంఅంతా ఉద్రిక్తత అలుముకున్నది. ఏ క్షణాన ఏం జరుగుతుందో అన్న ఆందోళన ప్రజల్లో కనిపిస్తున్నది.












Click it and Unblock the Notifications