సెహవాగ్‌ విజృంభణ-భారత్‌విజయం

కొలంబోః ఓపెనర్‌ వీరేంద్ర సెహవాగ్‌ అద్భుతమైన బ్యాటింగ్‌, గంగూలీ, ద్రావిడ్‌ సమయోచిత బ్యాటింగ్‌ తో న్యూజిలాండ్‌ ను చిత్తుచేసి భారత్‌ ఫైనల్‌ లో ప్రవేశించింది. ఆదివారం శ్రీలంకతో జరిగే ఫైనల్‌ లో భారత్‌ ఆడుతుంది. కోకొకోలా కప్‌ నుంచి బయటకు వచ్చేసిందని భావించిన భారత్‌ జట్టు వరసగా మూడు మ్యాచ్‌ లో గెలిచి సత్తా నిరూపించుకుంది. ఈ టోర్నమెంట్‌ లో ఇప్పటి వరకు సరిగా ఆడని ఓపెనర్‌ వీరేంద్ర సెహవాగ్‌ 70 బంతుల్లో 100 పరుగులు చేసి భారత్‌ గెలుపు దాదాపు ఖాయం చేశాడు. అతనికి అండగా నిలబడడంతో పాటు కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడిన గంగూలీ 7 ఫోర్లతో 67 పరుగలు చేశాడు. వైస్‌ కెప్టెన్‌ కూడా బాధ్యతాయుతంగా ఆడి 56 బంతుల్లో 57 పరుగులు, హేమాంగ్‌ బదాని 38 బంతుల్లో 36 పరుగులు చేసి భారత్‌ సునాయాస విజయానికి తోడ్పడ్డారు.

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ తీసుకున్న న్యూజిలాండ్‌ ఈటోర్నమెంట్‌ లోనే అత్యధికంగా 264 పరుగులు చేసింది. నాధన్‌ ఆస్టే 143 బంతుల్లో 108 పరుగులు చేశాడు.విన్సెంట్‌ దూకుడుగా ఆడి 35 బంతుల్లో 47 పరుగలు చేసి న్యూజిలాండ్‌ భారీ స్కోరు చేసేందుకు తోడ్పడ్డాడు. యువరాజ్‌ సింగ్‌ 2, నెహ్రా 3, జహీర్‌ఖాన్‌ 2 వికెట్లు సాధించారు. న్యూజిలాండ్‌ భారీస్కోరు సాధించినప్పటికీవీరేంద్ర సెహవాగ్‌ 70 బంతుల్లో 19 ఫోర్లు, ఒకసిక్సర్‌ సాధించి సెంచరీ చేయడంతో భారత్‌విజయం ఖాయమైంది.

వన్డే చరిత్రలో తక్కువ బంతుల్లో సెంచరీ చేసిన ఆరవ వ్యక్తిగాసెహవాగ్‌ చరిత్ర సృష్టించి మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డుఅందుకున్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+