కరవు అంచనాకు కేంద్ర బృందం
6న కరవుఅంచనాకు కేంద్ర బృందం
న్యూఢిల్లీ: రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర కరవు పరిస్ధితులనుఅంచనా వేసేందుకు సోమవారం నాడు రాష్ట్రానికి ఓ బృందాన్ని కేంద్రం పంపుతోంది. రాష్ట్రమంత్రులుఅశోక్ గజపతి రాజు, నాగం జనార్ధనరెడ్డిల ఆధ్వర్యంలో పార్లమెంటు సభ్యులతో కూడిన రాష్ట్ర బృందం ప్రధాని వాజ్‌పేయి, కేంద్ర వ్యవసాయ, ఆహారశాఖామంత్రులను కలిసి రాష్ట్రంలో నెలకొన్న కరవు పరిస్ధితులను వివరించింది. ఈ సందర్భంగా రాష్ట్రానికి 849 కోట్ల రూపాయల కరవు సహాయాన్ని అందించాలని రాష్ట్ర బృందం కేంద్రాన్ని అభ్యర్ధించింది. ఇందుకు స్పందించిన ప్రధాని సోమవారం కేంద్ర బృందాన్ని రాష్ట్రానికి పంపాలని నిర్ణయించారు.
రాష్ట్రంలోని 22 జిల్లాలలో కరవు వున్నట్లు రాష్ట్ర క్యాబినెట్ బుధవారం ప్రకటించిన విషయం విదితమే. కేంద్రాన్ని కరవు సాయంగా 850 కోట్ల రూపాయలు ఇవ్వాలని కోరడంతో పాటు 60 లక్షల టన్నుల ధాన్యాన్ని కరవు సాయంగా ఇవ్వాలని మంత్రులు కేంద్రాన్ని కోరారు. కేంద్రం వెంటనే స్పందించి రాష్ట్రంలో కరవు పరిస్థితిని అధ్యయనం చేసేందుకు ఒక బృందాన్ని పంపాలని నిర్ణయించింది. కేంద్ర బృందం అంచనాల మేరకు ఆంధ్రప్రదేశ్ కు అందించే కరవు సాయాన్ని నిర్ణయించే అవకాశాలున్నాయి.
నివేదికలు సిద్ధం చేయండిః బాబు
ఈ నెల 6 న వచ్చే కేంద్ర బృందానికి సమర్పించేందుకు కరవుపై నివేదికలు సిద్ధం చేయాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. కరవు గురించి ఆయన గురువారం 22 జిల్లాల కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడారు. రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై సూచనలు ఇవ్వాల్సిందిగా ఆయన సంబంధిత అధికారులను సూచించారు. రాష్ట్రంలో కరవు వున్నప్పటికీ నిధుల కొరత రానివ్వకుండా తగు చర్యలు తీసుకుంటామని అయన చెప్పారు.
కరవుతోఅల్లాడుతున్నాంఆదుకోండిఃబాబు












Click it and Unblock the Notifications