గోపీచంద్ కు రాజీవ్ ఖేల్ రత్న
న్యూఢిల్లీః ఆల్ ఇంగ్లాండ్ బాడ్మింటన్ విజేత, ఆంధ్ర తేజం పుల్లెల అవార్డు లభించింది. క్రికెటర్ వెంకటేష్ ప్రసాద్, ప్రముఖ అథ్లెట్ మిల్కాసింగ్ తో పాటు 31 మందికి అర్జున అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అదే విధంగా ఐదుగురు కోచ్ లకు ద్రోణాచార్య అవార్డులను కేంద్రం ప్రకటించింది.
అర్జున అవార్డుకుఎంపికైన వారిలో 15 మందికి లైఫ్ టైమ్ అఛీవ్ మెంట్ పురస్కారం లభించింది. హాకీ స్టార్ బల్జీత్‌సింగి, షూటర్లు అంజలి వేద్ పాథక్, అభినవ్ బింద్రా, అథ్లెట్ బీనామోల్, వెయిట్ లిఫ్టర్ సనమాచా చాను తదితరులుఅర్జున అవార్డులు పొందిన వారిలో వున్నారు. హాకీ ఒలంపియన్ భోలా, నేషనల్ హాకీ కోచ్ బాల్ కిషన్‌సింగ్, టెన్నిస్ కోచ్ అక్తర్ ఆలీ, అధ్లెట్ విజయమాలా బెహనాట్, భారత దేశానికి తొలి ఒలంపిక్ పతకానికికారకుడైన కె.డి. యాదవ్ కు లైఫ్ టైమ్ అఛీవ్ మెంట్ అవార్డులు దక్కాయి.












Click it and Unblock the Notifications