హైసియాకు మాంద్యందెబ్బ
హైదరాబాద్:అమెరికా మాంద్య ప్రభావం హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పోర్టర్స్ ఆసోసియేషన్‌కు కూడా సోకింది. సంక్షోభాన్ని అధిగమించడానికి సుమారు 40 కోట్ల రూపాయల మూలనిధితో రీసర్జెన్సీ ఫండ్‌ను ఏర్పాటు చేసే ప్రయత్నంలో హైసియా వుంది. ఇందుకోసం ప్రభుత్వం సాయం కోరాలని నిర్ణయించింది. అమెరికా మాంద్యం ప్రభావం నుంచి చిన్న మధ్య తరహా ఐటి కంపెనీలు తట్టుకుని బయటపడాలంటే ఆపత్కాల నిధి అవసరమని హైసియా అధ్యక్షుడు జెఎ చౌధరి అన్నారు.
మూల నిధిని ప్రభుత్వం సమకూర్చగలిగితే తాము బాంకులు, ఆర్ధిక సంస్థల సహకారంతో ఈ నిధిని పెంచుకోగలమని ఆయన చెప్పారు. ఈ నిధి ఏర్పాటు విషయంలో ఎస్‌టిపిఐ సాయం కూడా తీసుకుంటామని ఆయన అన్నారు. భవిష్యత్ వృద్ధిని దృష్టిలో వుంచుకుని ఐటి రంగంలోని చిన్న మధ్య తరహా కంపెనీలను ఆదుకోవడానికి ప్రభుత్వం ముందుకు రావాలని ఆయన కోరారు.












Click it and Unblock the Notifications