వాస్తు ప్రకారం ఇంట్లో ఈ మొక్క ఉంటే.. అన్నీ కలిసొస్తాయ్

ఇంటిని అందంగా అలంకరించుకోవడానికి చాలామంది రకరకాల మొక్కలను పెంచుతుంటారు. వాటిలో 'లక్కీ బాంబూ' (వెదురు మొక్క) అత్యంత ప్రాచుర్యం పొందింది. ఇంటి అలంకరణ కోసమే కాకుండా, వాస్తు శాస్త్రం ప్రకారం కూడా ఈ లక్కీ బాంబూకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఇంట్లో ఈ మొక్కను ఉంచడం వల్ల సకారాత్మక శక్తి పెరిగి, ప్రతికూలతలు తొలగిపోతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

ఇది కుటుంబ సభ్యుల మధ్య బంధాలను బలోపేతం చేయడంతో పాటు ప్రశాంతమైన వాతావరణాన్ని అందిస్తుంది. లక్కీ బాంబూ మొక్క ఇంట్లోని దోషాలను నివారించి ఐశ్వర్యం, ఆరోగ్యం, విజయం, కీర్తిని ఆకర్షిస్తుంది. ఈ మొక్కను సరైన దిశలో ఉంచినప్పుడు మాత్రమే ఆశించిన ఫలితాలు లభిస్తాయి. వాస్తు నియమాలను పాటించకుండా ఎక్కడ పడితే అక్కడ ఉంచితే దీని వల్ల ప్రయోజనం ఉండకపోవచ్చు. అందుకే ఇంట్లో లేదా ఆఫీసులో లక్కీ బాంబూను ఉంచేటప్పుడు కొన్ని కీలక విషయాలను గుర్తుంచుకోవాలి.

Unlock Lucky Bamboo Vastu Benefits Right Direction Right Number of Stalks for attracting wealth

లక్కీ బాంబూను ఏ దిశలో ఉంచాలి?

వాస్తు శాస్త్రం ప్రకారం లక్కీ బాంబూ మొక్కను ఉంచడానికి తూర్పు దిశ అత్యంత అనుకూలమైనది. తూర్పు దిక్కు ఆరోగ్యం, ఎదుగుదలకు ప్రతీకగా నిలుస్తుంది. ఈ దిశలో వెదురు మొక్కను ఉంచడం వల్ల కుటుంబంలో శాంతి నెలకుంటుంది, పురోగతి సాధ్యమవుతుంది. ఒకవేళ ఆఫీసులో లేదా పని చేసే డెస్క్ మీద ఉంచుకోవాలనుకుంటే, ఇది కెరీర్ ఎదుగుదలకు, కొత్త అవకాశాలకు దోహదపడుతుంది.

సాధారణంగా రెండు నుంచి మూడు అడుగుల ఎత్తున్న మొక్కలను ఎంచుకోవడం మంచిది. అలాగే పడకగదిలో రెండు కాడలు ఉన్న లక్కీ బాంబూ మొక్కను పెడితే దంపతుల మధ్య అనురాగం పెరుగుతుందని విశ్వసిస్తారు. ప్రతి పని కూడా సజావుగా సాగుతుందని విశ్వసిస్తారు. వెదురుకు వేగంగా పెరిగే గుణం ఉందనే విషయం తెలిసిందే. అలాగే తమ కుటుంబం కూడా పురోగతి చెందుతుందని నమ్ముతారు.

కాడల సంఖ్యకు ఉండే ప్రాధాన్యం

లక్కీ బాంబూ కుండీలో ఉండే కాడల (Stalks) సంఖ్యను బట్టి వేర్వేరు ఫలితాలు ఉంటాయని వాస్తు నిపుణులు చెబుతారు. ఆ విశ్లేషణను క్రింది పట్టికలో చూడవచ్చు:

కాడల సంఖ్య లభించే శుభ ఫలితం
2 కాడలు దాంపత్య జీవితంలో ప్రేమ, బలమైన సంబంధాలు
3 కాడలు సంతోషం, సంపద, దీర్ఘాయుష్షు
5 కాడలు ఆరోగ్యకరమైన ఎదుగుదల
8 కాడలు ఆర్థిక పురోగతి, అపార సంపద
9 కాడలు అదృష్టం, అఖండ విజయం

వాస్తు ప్రకారం లక్కీ బాంబూ ఉన్న పాత్ర చుట్టూ ఎరుపు రంగు రిబ్బన్‌ను కట్టడం ఎంతో శ్రేయస్కరం. ఎందుకంటే వెదురు మొక్క చెక్క (Wood) తత్వాన్ని కలిగి ఉండగా, ఎరుపు రంగు అగ్ని (Fire) తత్వానికి సంకేతం. ఈ రెండింటి కలయిక జీవితంలో పంచభూతాల సమతుల్యతను తీసుకువస్తుంది.

చేయకూడని పొరపాట్లు ఇవే!

ఈ మొక్కను సంరక్షించేటప్పుడు కొన్ని పొరపాట్లు అస్సలు చేయకూడదు. లక్కీ బాంబూకు నేరుగా ఎండ తగిలేలా ఉంచకూడదు, వీటికి తక్కువ వెలుతురు మాత్రమే సరిపోతుంది. కుండీలోని నీరు అపరిశుభ్రంగా మారకుండా చూసుకోవాలి. వారానికి కనీసం ఒక్కసారైనా నీటిని తప్పకుండా మార్చాలి. ఇంట్లో ఎండిపోయిన లేదా దెబ్బతిన్న వెదురు మొక్కలను ఉంచకూడదు, దీనివల్ల ప్రతికూల శక్తి పెరిగే ప్రమాదం ఉంది. ఈ నియమాలను పాటిస్తూ మొక్కను సంరక్షిస్తే అది ఇంటికి అందాన్ని మాత్రమే కాక సకల శుభాలను చేకూరుస్తుంది.

Disclaimer: వాస్తు ప్రకారం లక్కీ బాంబూ ప్లాంట్ విశేషాలను తెలియజేయడమే ఈ కథనం ఉద్దేశం. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి వాస్తు నిపుణులను సంప్రదించాల్సి ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+