కరీంనగర్ కోటలో టిఆర్‌ఎస్ పాగా
కరీంనగర్ : కరీంనగర్ జిల్లా పరిషత్ అధ్యక్షస్ధానం ఎట్టకేలకు తెలంగాణా రాష్ట్ర సమితి వశమయ్యింది. అధ్యక్ష ఎన్నిక రెండు సార్లు వాయిదా పడి తీవ్ర ఉత్కంఠత రేకెత్తించింది. చివరకు గురువారం నాడు జరిగిన ఎన్నికలో బిజెపికి చెందిన ఐదుగురు, కాంగ్రెస్ సభ్యుడు ఒకరు ఎన్నికకుహాజరై టిఆర్‌ఎస్‌ను బలపర్చటంతో టిఆర్‌ఎస్ అధ్యక్షస్ధానాన్ని చేజిక్కించుకోగలిగింది.
టిఆర్‌ఎస్‌కు చెందిన మెట్‌పల్లి జడ్‌పిటిసి సభ్యుడుకె.వి. రాజేశ్వరరావు అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షునిగా టిఆర్‌ఎస్‌కే చెందిన సుధీర్‌కుమార్ ఎన్నికయ్యారు. దీంతో ఇన్నాళ్లుగా జడ్‌పి అధ్యక్షుని ఎన్నికపై నెలకొన్న సస్పెన్స్ తొలగిపోయింది. ఇదిలావుండగా, కరీంనగర్ జడ్‌పి అధ్యక్ష ఎన్నికలో పార్టీ విప్‌ను తిరస్కరించి, టిఆర్‌ఎస్‌ను బలపర్చిన ఐదుగురు జడ్‌పిటిసిలను పార్టీనుంచి బిజెపి సస్పెండ్ చేసింది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంగించినందుకు వారిని సస్పెండ్ చేస్తున్నట్టు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు చిలకం రామచంద్రారెడ్డి ప్రకటించారు.












Click it and Unblock the Notifications