వార్ నేత లొంగుబాటు
హైదరాబాద్: నిషిద్ధపీపుల్స్‌వార్ జంటనగరాల సెంట్రల్ ఆర్గనైజర్ పాకాల రాజు గురువారం పోలీసులకు లొంగిపోయాడు. 1991లో కరీంనగర్ జిల్లా సిరిసిల్ల దళంలో రాజు పనిచేశాడు. ఆ తర్వాత వరంగల్ జిల్లా జనగాంసెంట్రల్ ఆర్గనైజర్‌గా పని చేశాడు. అనంతరం గత కొద్ది సంవత్సరాలుగా హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాలసెంట్రల్ ఆర్గనైజర్‌గా పని చేస్తూ వస్తున్నాడు.
హైదరాబాద్ పోలీసు కమిషనర్‌పేర్వారం రాములు వద్ద లొంగిపోయిన రాజు పీపుల్స్‌వార్ నాయకత్వం అనుమతి తీసుకొని తాను లొంగిపోయినట్లు చెప్పాడు. నక్సలైట్ ఉద్యమం ప్రస్తుతం అనేక ఒడిదొడుకులను ఎదుర్కుంటోందని అతను అన్నాడు.












Click it and Unblock the Notifications