యశ్వంత్ రాజీనామాకు డిమాండ్
న్యూఢిల్లీః యు.టి.ఐ. కుంభకోణంపై గురువారం పార్లమెంటు ఉభయ సభలు దద్దరిల్లిపోయాయి. ఈ కుంభకోణంపై వాయిదా తీర్మానం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోసింది. ప్రజల కష్టార్జితాన్ని కాపాడడంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి యశ్వంత్ సిన్హా రాజీనామా చేయాలని, ఈ కుంభకోణంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ లోక్ సభలో నినదించింది.
తన రాజీనామా వల్ల యు.టి.ఐ. సమస్య పరిష్కారం కాదని, గతంలో దేశాన్ని పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వాల నిర్వాకం వల్లే యు.టి.ఐ. ఇలా వుందని యశ్వంత్ సిన్హా ఎదురు దాడి చేశారు. దీనితో మరింత రెచ్చిపోయిన కాంగ్రెస్ పార్టీ సభా కార్యక్రమాలను స్తంభింపచేసింది.
వాయిదా తీర్మానంపై చర్చను ప్రారంభించిన కాంగ్రెస్ నేత ప్రియరంజన్ దాస్ మున్షీ యు.టి.ఐ. ని యునైటెడ్ థీవ్స్ ఆఫ్ ఇండియాగా అభివర్ణించారు. ఇందుకు యశ్వంత్ సిన్హా తీవ్రంగా స్పందిస్తూ జెపిసికానీ, తాను రాజీనామా చేసే ప్రసక్తి కానీ లేదన్నారు. యు.టి.ఐ. మాజీ ఛైర్మన్‌సరైన సమాచారం ఇవ్వనందుల్లే ఈ అనర్ధం జరిగిందని, దీనిపై సిబిఐ చేత పూర్తి స్థాయిలోవిచారణ జరిపిస్తామని ఆయన హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications