నీటి ఛార్జీలుపెంచం: మండవ
హైదరాబాద్: వ్యవసాయ రంగంలో నీటి ఛార్జీలుపెంచే యోచన లేదని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి మండవ వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. నీటి ఛార్జీలు పెంచడానికి ప్రభుత్వంమీటర్లు పెడుతోందనే విమర్శలో నిజం లేదని ఆయన గురువారంవిలేకరుల సమావేశంలో అన్నారు. నీటి మీటర్లను ఏర్పాటు చేయడాన్ని ప్రతిపక్షాలు అనవసరంగా రాజకీయం చేస్తున్నాయని ఆయన అన్నారు. నీటి పారుదల ప్రాజెక్టులకు సంబంధించిన కాలువల చివరి భూములకు నీరందించేందుకువీలుగా ఈ నీటి మీటర్లను పెడుతున్నట్లు ఆయన తెలిపారు.
ఇదిలా వుంటే, ప్రపంచ బ్యాంక్ షరతుల మేరకే రాష్ట్ర ప్రభుత్వం నీటిమీటర్లు పెడుతోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బి.వి. రాఘవులు గురువారం మరోవిలేకరుల సమావేశంలో విమర్శించారు. నీటిమీటర్లు ఏర్పాటు చేయాలనే షరతు ప్రపంచ బ్యాంక్ ఒప్పందంలో స్పష్టంగా వున్నదని ఆయన అన్నారు. నీటి ఛార్జీలుపెంచేందుకే నీటి మీటర్లు ఏర్పాటు చేస్తున్నారని ఆయనవిమర్శించారు. నీటి సంఘాల సమావేశాలు ఏర్పాటు చేయకుండానే, నీటి సంఘాలతో చర్చించకుండానే ప్రభుత్వం నీటిమీటర్లు ఏర్పాటు చేసేందుకు పూనుకుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications