వర్షాలకు కూలిన రంగారెడ్డి డిఐజి ఆఫీస్
హైదరాబాద్‌ః రాష్ట్రంలో నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ లో గత శనివారం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వర్షం కారణంగా సోమవారం రంగారెడ్డి జిల్లా డిఐజి కార్యాలయం కూలిపోయింది. వంద సంవత్సరాల నాటి ఈ కార్యాలయాన్ని వేరే చోటకు మార్చేందుకుసన్నాహాలు చేస్తున్నారు. ఈ లోగా ఈ కార్యాలయం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. భవనం కూలిపోతున్న సమయంలో డిఐజి సాంబశివరావు కానీ, సిబ్బంది కానీ అక్కడ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
డిఐజి కూర్చొనే చోటనేపైకప్పు కూలి పడింది. దీనితో డిఐజి టేబుల్ ధ్వంసమైంది. ఆ సమయంలో డిఐజి అక్కడ వుంటేపెద్ద ప్రమాదం సంభవించేదని సిబ్బంది తెలిపారు. హైదరాబాద్ లో సోమవారం కుండపోతగా వర్షం కురుస్తునే వుంది. దీనితో ప్రధాన రహదారులన్నీ జలమయం అయ్యారు. మురికివాడల ప్రజలు నానా అవస్థలు పడ్డారు.












Click it and Unblock the Notifications