Mavigun vs Amaravati: జగన్ సవాల్ తెచ్చిన మార్పు..! టీడీపీ టోన్ మారుతోందా ?

మావిగన్ (Mavigun) వర్సెస్ అమరావతి (Amaravati) గా వచ్చే ఎన్నికల అజెండాను మారుస్తామంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ విసిరిన సవాల్ అధికార కూటమిని నడుపుతున్న టీడీపీపై పనిచేస్తున్నట్లే కనిపిస్తోంది. ముఖ్యంగా మావిగన్ విషయంలో సోషల్ మీడియాలో వస్తున్న స్పందన టీడీపీని చికాకు పెడుతున్నట్లు తెలుస్తోంది. జగన్ సవాల్ పై తాజాగా స్పందించిన సీఎం చంద్రబాబు.. తమ రాజధాని అమరావతి మాత్రమేనని తేల్చేశారు. అయితే ఆ తర్వాత సోషల్ మీడియాలో స్పందన చూశాక టీడీపీ సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా స్పందించిన తీరు చూస్తే ఆ పార్టీ కూడా రూటు మార్చబోతున్నట్లు అర్థమవుతోంది.

అమరావతికి కౌంటర్ గా జగన్ మావిగన్ ను తెరపైకి తెచ్చినప్పుడు టీడీపీ లైట్ తీసుకుంది. గతంలో మూడు రాజధానులు అన్నారు, ఇప్పుడు మావిగన్ అంటున్నారు.. అంతేగా అన్నట్లు కామెడీగా ట్రోల్స్ మొదలుపెట్టింది. అయితే ఈసారి జగన్ వచ్చే ఎన్నికల్లో మావిగన్ వర్సెస్ అమరావతిగానే వెళ్తామంటూ విసిరిన సవాల్ ను మాత్రం టీడీపీ అంత లైట్ తీసుకోలేకపోతోంది. దీంతో వరుసగా మంత్రులు, టీడీపీ ముఖ్యనేతలు దీనిపై స్పందించి విమర్శలకు దిగుతున్నారు.

Jagan s Mavigun Plan Wins Online Praise Rattled TDP Claims Amaravati No Different

అయితే తాజాగా టీడీపీకి అనుకూలంగా ఉండే ఓ యూట్యూబ్ ఛానల్, అలాగే టీడీపీ సోషల్ మీడియా కార్యకర్త యూట్యూబ్, ఎక్స్ లో పెట్టిన పోల్స్ లో అమరావతి కంటే మావిగన్ కే ఎక్కువ మద్దతు లభించింది. దీంతో సదరు టీడీపీ సోషల్ కార్యకర్త .. వైసీపీ చాట్ బోట్స్ తో తన పోల్ ను హైజాక్ చేసిందంటూ దాన్ని డిలీట్ చేసేసింది. దాని స్ధానంలో పోల్ పెట్టగానే వచ్చిన స్పందన ఉన్న మరో పోస్ట్ పెట్టింది. ఈ రెండు పరిణామాల తర్వాత టీడీపీ సోషల్ మీడియా విభాగం ఎక్స్ లో ఓ పోస్ట్ పెట్టింది.

Jagan s Mavigun Plan Wins Online Praise Rattled TDP Claims Amaravati No Different

ఇందులో CRDA మాస్టర్ ప్లాన్ ఇది .. ప్రపంచ బ్యాంక్ కి ఇచ్చిన డాక్యుమెంట్ .. గుంటూరు - జగ్గయ్యపేట - నుజివీడు - మచిలీపట్నం .. విజయవాడ Airport కి 30 KM .. మచిలీపట్నం పోర్టుకి 68 KM ..12 ఏళ్లుగా చంద్రబాబు చెప్పేది ఇదే కదా ..? మరి " MAVIGUN " అంటే ఏంటి ? ఈ ప్రాంతాలలో కాకుండా గాల్లో కడతారా ..? గొడ్డలి పార్టీకి ప్రజలంటే ఎంత చిన్న చూపు ..? అంటూ ఓ పోస్ట్ పెట్టింది. అంటే మావిగన్ అనేది మేం చెబుతున్న అమరావతి రాజధానిలోనే ఉంది కదా అనేది ఈ పోస్టు సారాంశం. కానీ వైసీపీ మాత్రం తమ మావిగన్ కు అమరావతితో సంబంధం లేదని చెబుతోంది. దీంతో రాబోయే రోజుల్లో టీడీపీ మావిగన్ పై తమ వాదనను మరింత ముందుకు తీసుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+