మావిగన్ వేస్ట్- అమరావతిపై కోర్టుకు..! సాయిరెడ్డి మరో సంచలనం..!

ఏపీ రాజధాని అమరావతి (Amaravati) స్ధానంలో మావిగన్ (Mavigun) ను ప్రతిపాదిస్తూ, వచ్చే ఎన్నికల్లో ఈ రెండింటి మధ్య పోరాటమే అజెండాగా మారుస్తామని వైఎస్ జగన్ (YS Jagan) తాజాగా చేసిన ప్రకటనపై వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి (Vijayasai Reddy) స్పందించారు. అటు చంద్రబాబు అమరావతిని, ఇటు జగన్ మావిగన్ ప్లాన్ ను విమర్శిస్తూ సాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగకుండా అమరావతిపై కోర్టును ఆశ్రయించబోతున్నట్లు ఆయన ప్రకటించారు.

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి మాత్రమే అని టీడీపీ, కాదు మావిగన్‌ అని వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రెండూ చేస్తున్న భిన్న అర్థరహిత వాదనలు చూసిన తరవాత, బాధ్యత గల ఒక పౌరుడిగా తన అభిప్రాయాలు ప్రజలతో పంచుకుంటున్నాని సాయిరెడ్డి ట్వీట్ చేశారు. ఇందులో రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలి అన్న అంశం మీద శివరామకృష్ణన్‌ కమిటీ ఇచ్చిన నివేదికను వీరంతా ఎందుకు పక్కన పెట్టారని చంద్రబాబును ప్రశ్నించారు. అలాగే 2014లో రాష్ట్ర విభజన జరిగిందని, పన్నెండేళ్ళ తరవాత కూడా ఇంకా రాజధాని ఎక్కడ ఉండాలన్న చర్చ నడుస్తోందంటే ఇది అందరూ సిగ్గు పడాల్సిన విషయం కాదా? అని ప్రశ్నించారు.

Vijayasai Reddy to Move Court Over Amaravati Capital Corruption Dismisses YS Jagan s Mavigun Plan
మోడీ కేబినెట్లో కొత్తగా ఆ శాఖ..!ప్రక్షాళన వేళ సాయిరెడ్డి రిక్వెస్ట్..!
మోడీ కేబినెట్లో కొత్తగా ఆ శాఖ..!ప్రక్షాళన వేళ సాయిరెడ్డి రిక్వెస్ట్..!

రాష్ట్రం విడిపోయిన 15 ఏళ్ల తరవాత 2029లో మరో జనరల్‌ ఎన్నికలు జరుగుతాయని, ఆ ఎన్నికల్లో కూడా రాజధాని ఎక్కడ ఉండాలో ప్రజలు మరోసారి నిర్ణయించాలా? రాజధాని పేరుమీద జరుగుతున్న ఈ పొలిటికల్‌ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ను ఆపేయాల్సిన బాధ్యత అన్ని పార్టీల మీదా ఉందా? లేదా? అని నిలదీశారు. మొదటి విడతలో ల్యాండ్‌ పూలింగ్‌కు భూములు ఇచ్చిన రైతులకు ఇప్పటికీ ప్లాట్లు అప్పగించకపోవటాన్ని, కేటాయింపులే చేయకపోవటాన్ని ఎలా సమర్థించుకుంటారన్నారు. క్ష ఎకరాలు రాజధానికి ఏం చేసుకుంటారని అడిగారు. వియవాడ-గుంటూరు-తెనాలి-మంగళగిరి అనే వి జి టి ఎం కాన్సెప్ట్‌ విభజన చట్టంలోనే ఉంది కదా? ఈ ప్రాంతం అంతటికీ రాజధాని భవనాలను విస్తరిస్తే అందులో పోయేది ఏం ఉంటుందన్నారు.

జగన్ 'మావిగన్' సవాల్ వెనుక 15-29 సమీకరణం? ఏంటీ లెక్క ?
జగన్ 'మావిగన్' సవాల్ వెనుక 15-29 సమీకరణం? ఏంటీ లెక్క ?

అసలు అంశం రాజధాని నిర్మాణం పేరుమీద జరుగుతున్న అవినీతి. ఇందుకోసం ఏకంగా రూ.50 వేల కోట్లు ఇప్పటి ప్రభుత్వం ఖర్చు చేస్తోందని, ప్రతీ నిర్మాణంలో భారీగా నిర్మాణ వ్యయాన్ని పెంచి చూపించారని,దీని అర్థం... భారీగా అవినీతికి వేస్తున్న పథకానికి అమరావతి అని అందమైన పేరు పెట్టారన్నారు. ఇది దేవతల రాజధాని అని కూడా బ్రహ్మాండమైన అబద్ధపు బ్రాండింగ్‌ ఇచ్చారన్నారు. నేరుగా అధికారంలో ఉన్న వారు 25 నుంచి 30 శాతం డబ్బును లంచాలుగా తీసుకునేందుకు ఈ దేవతల రాజధాని బ్రాండింగ్‌ వాడుకుంటున్నారన్నారు. అమరేశ్వరుడి ఆలయం, బుద్ధ విగ్రహం ఉన్న అమరావతికి... ఇప్పుడు బిల్డింగులు కడుతున్న ప్రాంతం 50 కిలోమీటర్ల దూరంలో ఉందన్నారు. ఆ అమరావతి దైవ క్షేత్రం, కృష్ణమ్మ ప్రవహిస్తున్న క్షేత్రం అయితే ఈ అమరావతి అవినీతి పారుతున్న క్షేత్రమన్నారు.

శ్రీమంతులు రెడీ.. మరి మీరు..! కేంద్రం సాయం కోరిన సాయిరెడ్డి..!
శ్రీమంతులు రెడీ.. మరి మీరు..! కేంద్రం సాయం కోరిన సాయిరెడ్డి..!

బిల్డింగుల నిర్మాణానికి ఏకంగా రూ 50 వేల కోట్లు ఖర్చు చేస్తున్నప్పుడు అందులో 25-30 శాతం అవినీతికి ఆస్కారం కనిపిస్తున్నప్పుడు,మనమంతా ప్రజలుగా మొదట ప్రశ్నించాల్సింది ఈ అవినీతిని అన్నారు. అంటే ఇది దాదాపు 15 వేల కోట్ల లంచాల మేతకు వేసిన పథకమన్నారు. మరి ఈ విషయాన్ని వదిలేసి మావిగన్‌ అనటం వల్ల ప్రయోజనం ఏమిటి? అని జగన్ ను ప్రశ్నించారు. మరో మూడేళ్ళలో జరిగిపోయే నిర్మాణాలన్నీ ఏం చేద్దాం? రాజధానిని నిర్మించటం అంటే అవినీతికి బాగా ఆస్కారం ఉన్న బిల్డింగులు ఏ పార్టీ కట్టాలి... ఎంత కమీషన్లు కొట్టాలి అన్నది కాదు కదా అని ప్రశ్నించారు. కాబట్టి, అమరావతి పేరిట జరుగుతున్న అవినీతి యజ్ఞాన్ని ప్రజలందరి తరఫున ప్రశ్నిస్తూ, ఎస్కలేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలతో అవినీతిని సవాలు చేస్తూ త్వరలో న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని సాయిరెడ్డి ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+