ఏలేరుకు బాబు ఎగనామంః రోశయ్య
హైదరాబాద్‌ః ఏలేరు కుంభకోణంపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సోమశేఖర కమిషన్ చెల్లుతుందంటూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని అయితే ఆ కమిషన్ ను చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రద్దు చేసిందని కాంగ్రెస్ పార్టీ ధ్వజమెత్తింది. సోమశేఖర కమిషన్ ను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు సుప్రీంకోర్టును ధిక్కరించడమేనని కాంగ్రెస్ అధికార ప్రతినిధికె. రోశయ్య సోమవారం విలేకరుల సమావేశంలోవిమర్శించారు.
ఏలేరు కుంభకోణంపై రాష్ట్ర ప్రభుత్వంఅప్పట్లో సోమశేఖర కమిషన్ ను ఏర్పాటు చేసింది. ఆ కమిషన్ ఏర్పాటును సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. అయితే ఆ కమిషన్ ను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 4 న జి.ఓ జారీ చేసింది. ఈ చర్యను ప్రతిపక్షాలన్నీ తీవ్రంగావిమర్శిస్తున్నాయి. ఏలేరు కుంభకోణాన్ని తుంగలో తొక్కేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని ప్రతిపక్షాలువిమర్శిస్తున్నాయి.












Click it and Unblock the Notifications