భీమవరం దొంగనోట్ల ముఠాఅరెస్టు
హైదరాబాద్: దొంగనోట్లను పంపిణీ చేస్తున్న ముఠాను హైదరాబాద్ సిటీ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు.
ఈ ముఠాకు చెందిన ముగ్గురిని అరెస్టు చేశారు. అరెస్టయిన ముగ్గురు కె వెంకటేశ్వరరావు, రవిరాజు, శ్రీనివాస్‌రాజు పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన వారని పోలీసులు చెప్పారు.
వీరినుంచి దొంగనోట్ల తయారీకి ఉపయోగించే సామాగ్రిని దొంగనోట్లను, రెండుసెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 15 రోజుల క్రితంవిజయవాడ పోలీసులు అరెస్టు చేసిన కట్టా బూబన్న ముఠాలో సభ్యునిగా వుంటూ వెంకటేశ్వరరావు ఈ దొంగనోట్ల వ్యాపారాన్ని సహచరులతో కలసి నిర్వహిస్తున్నాడు. ఇదిలా వుండగా గతంలో ఒక దొంగనోట్ల ముఠా చేతిలోఘోరంగా మోసపోయిన వెంకటేశ్వరరావు తానేస్వయంగా ఈ వ్యాపారం ప్రారంభించినట్టు పోలీసుల ఇంటరాగేషన్‌లో వెల్లడయింది.












Click it and Unblock the Notifications