తమిళనాడులోఅగ్ని ప్రమాదం-25 మంది మృతి
చెన్నై: తమిళనాడులో సోమవారం తెల్లవారుజామున జరిగిన ఒకఘోర అగ్ని ప్రమాదంలో 25 మంది మరణించారు. మరో ఐదుగురు గాయపడ్డారు. తమిళనాడులోని రామనాథపురం జిల్లాఎర్వాడి దర్గాకు సమీపంలో వున్న ఎర్వాడి గ్రామంలో గల మానసిక రోగులు శరణాయలంలో ఈఅగ్ని ప్రమాదం సంభవించింది.
మరణించివారందరూ మానసిక రోగులే. మానసిక రోగులను రాత్రి పూట కట్టిపడేయడంతో అగ్రి ప్రమాదం సంభవించినప్పుడు పారిపోలేకపోయారు. ప్రమాదం సంభవించిన సమయంలో శరణాలయంలో 40 మంది దాకా మానసిక రోగులున్నారు. అతి కష్టంమీద ఫైరింజన్ల ద్వారా మంటలనుఆర్పగలిగారు. లోపల వున్న వారిని ఛైన్లతో మంచాలకు కట్టివేయడంతో వారు మంటల తీవ్రతకుఅరుస్తూ అలాగే మరణించారు. హృదయ విదారకమైన ఈ దృశ్యాలు కలచివేసే విధంగా వున్నాయి. దర్గాకు సమీపంలో నివాసం వుంటే మానసికంగాస్వస్థత చేకూరుతుందనే నమ్మకంతో ఎందరో అభాగ్యలు ఈ అనాగరిక ప్రపంచంలో బతుకుతున్నారు.
హఠాత్తుగా మంటలు అంటుకోవడంతో రోగులు ఆక్రందనలు చేశారు. అయితే ఆ పిచ్చివాళ్ళు ఎప్పుడూ అంతేలే అనుకున్న పరిసరాల ప్రజలు పట్టించుకోక పోవడంతో వారు కాలి బుడిదయ్యారు.
ఈ దారుణానికి జాతీయ మానవహక్కుల సంఘం వెంటనే స్పందించి తక్షణ చర్యలు తీసుకోవలసిందిగా తమిళనాడు ప్రభుత్వాన్ని కోరింది. ఇదిలావుండగా ఎవరో కావాలనే ఈ దారుణానికి ఒడిగట్టారంటూ దర్గా నిర్వాహకుడు చెప్పడం గమనార్హం.












Click it and Unblock the Notifications