ముజఫర్‌ పూర్‌ లోముగ్గురుమృతి

పాట్నాః వరదలతో అల్లాడుతున్న బీహార్‌ ప్రజలు ప్రభుత్వం నుంచిసరైన సహాయం అందకపోవడంతో రగిలి పోతున్నారు. సోమవారం ముజఫర్‌ పూర్‌ సమీపంలో ఉద్యమించిన ప్రజలపై పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మరణించగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రభుత్వం సహాయం పంపిణీలో అవకతవకలు జరిగాయంటూ ప్రజలు నినదించారు. అధికారులపైవిరుచుకు పడ్డారు. ప్రజల విమర్శలను అధికారులు మామూలుగానే పెడచెవినపెట్టారు. దీనితో ఆగ్రహించిన ప్రజలు పోలీస్టేషన్‌ కు నిప్పుపెట్టి బీభత్సం సృష్టించారు.

ప్రజలను అదుపు చేసేందుకు పోలీసులు కాల్పులు జరపడంతో ముగ్గరు అక్కడికక్కడే నేలకొరిగారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడి ఆస్పత్రి పాలయ్యారు. మరోవైపు బీహార్‌ లో వరద పరిస్థితి ఇంకా ఆందోళన కరంగానే వుంది. సుమారు ఐదు లక్షల మంది ప్రజలు వరదల తీవ్రతకు నిరాశ్రయులయ్యారు.

బీహార్‌ పై లోక్‌ సభలో రభస
బీహార్‌ లో వరద బాధితులకు రబ్రీ దేవి సర్కార్‌సరైన సాయం అందించడం లేదంటూ వివిధ రాజకీయ పార్టీలు సోమవారం లోక్‌ సభలో ధ్వజమెత్తాయి. పలుసార్లు నిరసన తెలుపుతూ వెల్‌ లోకి దూసుకు వచ్చారు. బీహార్‌ వరద బాధితులకు కేంద్రం తక్షణ సాయంఅందించాల్సిందిగా వారు డిమాండ్‌ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+