నవంబర్ లో వాజ్‌పేయి రష్యా పర్యటన
న్యూఢిల్లీః భారత ప్రధాని వాజ్‌పేయి నవంబర్ లో రష్యా పర్యటించనున్నారు. నవంబర్ లో ఏ తేదీలలో వాజ్‌పేయి రష్యా పర్యటించేదీ ఇంకా ఖరారు కావలసి వుంది. వాజ్‌పేయి రష్యా పర్యటన సందర్భంగా ఉభయ దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యానికి నాంది పలికే రాజకీయ ప్రకటనపై వాజ్‌పేయి సంతకాలు చేసే అవకాశాలున్నాయి. రష్యా దౌత్య కార్యాలయానికి చెందిన ఉన్నతాధికారి ఒకరు ఈవిషయాన్ని వెల్లడించారు.
వాజ్‌పేయి రష్యా పర్యటన ఉభయ దేశాల మధ్య సంబంధాలను మరింత పటిష్టం చేస్తాయని రష్యా దౌత్య కార్యాలయానికి చెందినషెబార్షిన్ అన్నారు. గత ఏడాది అక్టోబర్ లో రష్యా అధినేత వ్లాడిమిర్ పుతన్ భారత్ పర్యటన సందర్భాగ ఈ ఒప్పందం ఖరారైందని ఆ అధికారివివరించారు.
పలు రంగాలలో భారత్ రష్యా దేశాల మధ్య సత్సంబంధాలు కొనసాగుతున్నాయని ఆ అధికారివివరించారు. రష్యా చమురు రంగంలో భారత్ భారీ పెట్టుబడులుపెట్టిందని, రష్యాలో అన్ని పాఠశాలలను త్వరలో కంప్యూటరీకరించనున్న దరిమిలా భారత్ కు భారీ ఆర్డర్లు వచ్చే అవకాశం వుందని కూడా అధికారులుఅంచనా వేస్తున్నారు.












Click it and Unblock the Notifications