ముగుస్తున్న TTD పాలక మండలి గడువు- కొత్త ఛైర్మన్, సభ్యులుగా వీరికే ఛాన్స్..!?

TTD కి కొత్త పాలక మండలి పైన కసరత్తు జరుగుతోంది. ప్రస్తుతం బీఆర్ నాయుడు ఛైర్మన్ గా నియమించిన బోర్డు గడువు ముగియనుంది. దీంతో.. కొత్త ఛైర్మన్ సహా పాలక మండలి సభ్యులు ఎవరనేది కీలకంగా మారుతోంది. కొత్త బోర్డు పైన ఇప్పటికే ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కొత్త ఛైర్మన్ విషయంలోనూ దాదాపు నిర్ణయం జరిగిందని చెబుతున్నారు. అయితే, ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఉండటంతో.. పూర్తయిన తరువాత అధికారికంగా ప్రకటన రానుంది. ఇక.. బోర్డు సభ్యులుగా పలువురు తమ వంతు ప్రయత్నాలు ప్రారంభించారు.

తిరుమల తిరుపతి దేవస్థానం ప్రస్తుత పాలక మండలి గడువు పూర్తి కానుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 2024 నవంబర్ 1న ఛైర్మన్ గా బీఆర్ నాయుడు, 24 మంది సభ్యులతో కొత్త పాలక మండలి నియమించారు. రెండేళ్ల కాల పరిమితి విధించారు. ఇప్పుడు ఆ సమయం ముగియటంతో కొత్త పాలక మండలి పైన కసరత్తు కొనసాగుతోంది. ప్రస్తుతం స్థానిక ఎన్నికలు జరుగుతుండటంతో ఇవి పూర్తయిన తరువాత అధికారికంగా కొత్త బోర్డును ప్రకటించే అవకాశం ఉంది. అప్పటి వరకు దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శితో ప్రత్యేకంగా స్పెసిఫైడ్ కమిటీ ప్రకటించనున్నారు. కొత్త పాలక వర్గం పైన భారీ అంచనాలు ఉన్నాయి. మూడు పార్టీల కూటమి అధికారంలో ఉండంతో... మూడు పార్టీల నుంచి ఆశావాహుల సంఖ్య ఎక్కువగా ఉంది.

 ఎన్నికల కోడ్ తో PM Kisan, అన్నదాత సుఖీభవ నిధుల జమ వేళ కీలక నిర్ణయం..!!
ఎన్నికల కోడ్ తో PM Kisan, అన్నదాత సుఖీభవ నిధుల జమ వేళ కీలక నిర్ణయం..!!
ttd-board-term-ends-today-two-names-emerge-as-front-runners-for-new-chairman-post

ఎన్నికల తరువాత కొత్త బోర్డు నియామకం

కొత్త ఛైర్మన్ గా టీడీపీలోని ఇద్దరు సీనియర్ నేతలు పేర్లు రేసులో ఉన్నాయి. అందులో టీడీపీ ఏపీ అధ్యక్షుడిగా పని చేసిన కళా వెంకటరావు, ప్రస్తుత టీటీడీ బోర్డు సభ్యుడు జ్యోతుల నెహ్రూ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. కాగా.. ప్రస్తుత ఛైర్మన్ బీఆర్ నాయుడుకు మరో ఏడాది అవకాశం ఇస్తారనే వాదన ఉంది. అదే సమయంలో సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖుడు సైతం ఛైర్మన్ రేసులోకి వచ్చినట్లు సమాచారం. ఇక.. టీడీపీ, జనసేన, బీజేపీ నుంచి బోర్డు సభ్యులుగా ప్రాంతీయ సమీకరణాల ఆధారంగా అవకాశం దక్కనుంది. వీరితో పాటుగా తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర నుంచి బోర్డు సభ్యులుగా నియామకం చేయాల్సి ఉంది. బీజేపీ ముఖ్య నాయకత్వం ద్వారా ఇప్పటికే పలువురు సభ్యులుగా అవకాశం కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. దీంతో, చివరగా టీటీడీ నూతన ఛైర్మన్.. బోర్డు సభ్యులుగా ఎవరికి అవకాశం దక్కుతుందనేది ఉత్కంఠగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+