కాశ్మీర్‌లో పాక్ జెండాల రెపరెప
శ్రీనగర్‌ః జమ్మూకాశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో ఉగ్రవాదులు, పాకిస్తాన్ అనుకూలతీవ్రవాదులు ఎగురవేసిన పాకిస్తాన్ జాతీయపతాకాలను పోలీసులు తొలిగించారు. భారత స్వాతంత్ర్య దినోత్సవాల నిర్వహణకు జరుగుతున్న ఏర్పాట్లను సవాలు చేస్తూ తీవ్రవాదులు ఈ పాకిస్తాన్ జెండాలను శ్రీనగర్‌లోని పలు కీలక ప్రాంతాల్లో ఎగురవేశారు.
పాకిస్తాన్‌స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు 14 అగస్టునే జరుగుతున్నాయి. లాల్‌చౌక్, మైసుమా,రైనావరి, జమియా మసీదు ప్రాంతాల్లో పాక్ జెండాలను ఎగురవేశారని తెలిసింది. ఇదిలా వుండగా జమ్మూ ప్రాంతంలో రామ్‌ఘర్‌సెక్టార్‌లో పాకిస్తాన్ దళాలు జరిపిన కాల్పుల్లో బిఎస్‌ఎఫ్ జవాన్లు ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కాగా పంద్రాగస్టు రోజున తీవ్రవాదులు హింసాకాండకు పాల్పడే అవకాశం వున్న కారణంగా భద్రతను తీవ్రతరం చేశారు. శ్రీనగర్‌లో ప్రధాన ఉత్సవాలు జరిగే స్టేడియం పోలీసులు, భద్రతా దళాల దిగ్బంధలో వుంది.












Click it and Unblock the Notifications