అత్యంత ఆరాధ్యనీయ కంపెనీ ఇన్ఫోసిస్
న్యూఢిల్లీః దేశంలో అత్యంత ఆరాధ్యనీయ కంపెనీగా ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ నిలిచింది. 2001 సంవత్సరానికి సాఫ్రస్ మోడ్ రూపొందించిన మొదటి 60 కంపెనీల జాబితాలో మరో 14 ఐటి కంపెనీలు కూడా వున్నాయి. పాత ఆర్ధిక వ్యవస్థనుంచి ఈ జాబితాలో రిలయన్స్ రెండో స్థానంలో వుంది.
బిజినెస్ బ్యారన్ పత్రిక కోసం ఈ సర్వేను నిర్వహించారు. రిలయన్స్ తర్వాత స్థానంలో విప్రో, హిందుస్తాన్ లివర్, ఎల్‌అండ్‌టి, బజాజ్ ఆటో, హెచ్‌డిఎఫ్‌సి, కోల్గెట్, టాటా పవర్, బిపిఎల్ వున్నాయి. నిర్వహణ తీరు, ఆర్ధిక వ్యవహారాలు, వాటాదారులకు చెల్లించే ప్రతిఫలం, కంపెనీ నైతిక నియమాల ఆధారంగా ఈ కంపెనీలకు రాంకింగ్‌లు ఇచ్చారు. అత్యంత ఆరాధ్యనీయ సిఇవో స్థానం అంబానీకి దక్కింది. ఆయన తర్వాత స్థానాల్లో విప్రో అజిమ్ ప్రేమ్‌జీ, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి వున్నారు. రాష్ట్రానికి చెందిన సత్యం, విజువల్‌సాఫ్ట్ కూడా 60 కంపెనీల జాబితాలో స్థానం సంపాదించాయి.












Click it and Unblock the Notifications