వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చర్చి భారత సంస్కృతికి సవాల్‌ కాదు

By Staff
|
Google Oneindia TeluguNews

తిరువనంతపురం: భారత సంస్కృతికి ప్రమాదకరంగా పరిణమించాయనే ఉద్దేశంతోనే క్రిస్టియన్‌మిషనరీలపై ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి వ్యతిరేక వ్యాఖ్యలు చేసి వుంటారని భారత కాథలిక్‌ బిషప్స్‌ కాన్ఫరెన్స్‌ అధ్యక్షుడుఅర్చిబిషప్‌ సిరిల్‌ మార్‌ బాసిలియస్‌ అన్నారు. ఈ విధమైన అనుమానాలను అర్థవంతమైన చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చుకోవచ్చునని ఆయన బుధవారం అన్నారు.

క్రిస్టియన్‌ మతం ప్రత్యేకంగా కాథలిక్‌ మతం భారత సంస్కృతికి సవాల్‌ గానీ, ప్రమాదకరం గానీ కాదని ఆయన స్పష్టం చేశారు. భారత సంస్కృతితో పాటు సామరస్యపూర్వకంగా చర్చి మనుగడ సాగించగలదని శతాబ్దాల చరిత్ర రుజువు చేసిందని ఆయన అన్నారు.
కొన్ని క్రిస్టియన్‌ మిషనరీలు వెనుకబడిన ప్రాంతాల్లో ఉత్తమసేవలు అందిస్తుండగా, మరి కొన్ని మత మార్పిడులకు పాల్పడుతున్నాయని వాజ్‌పేయి ఇటీవల ఒక పుస్తకావిష్కరణ సభలో అన్నారు.

ప్రజలను తమ సంస్కృతీ సంప్రదాయాలకు దూరం చేయాలనే కార్యక్రమాలేవీ చర్చికి లేవని ఆయన అన్నారు. సరిగాఅర్థం చేసుకోకపోవడం వల్లనే మత మార్పిడుల గురించి ఆందోళన వ్యక్తమవుతోందని ఆయన అన్నారు. మత మార్పిడిఅంటే పేరును, జీవనశైలిని మార్చుకోవడం కాదని, నిజమైన మార్పిడి భగవంతుడి వైపు మార్పు చెందడమేనని ఆయన అన్నారు.అందువల్ల ఈ ప్రక్రియలో బలవంతపు మార్పిడులకు తావు లేదని ఆయన అన్నారు.

కొత్త విధానాలను, పద్ధతులను అంగీరించడంపై ఎవరు కూడా పూర్తిగా నిషేధంపెట్టలేరని, కాథలిక్‌ చర్చి అన్ని కాలాల్లో స్థానిక సంస్కృతికి తగిన ప్రాధాన్యం ఇచ్చిందని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X