భారత్ 232 ఆలవుట్- శ్రీలంక 52/1
కాండీః శ్రీలంకతో జరుగుతున్న రెండోటెస్ట్ లో భారత్ కేవలం 232 పరుగులకు ఆలౌట్‌అయింది. శ్రీలంక 274 పరుగుల స్కోరుకు సమాధానంగా భారత్ 232 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్ రమేష్ తరువాత హర్భజన్ సింగ్ కేవలం 32 బంతుల్లో 44 పరుగులు చేసి భారత్ పరువు దక్కించాడు.మిగిలిన బ్యాట్స్ మెన్ ఎవరూ చెప్పుకోతగ్గ స్కోర్లు సాధించలేక పోయారు. రెండో రోజు ఆట మొత్తంమీద శ్రీలంక బౌలర్ల ఆధిపత్యం కొనసాగింది. వాస్ కు నాలుగు, ఫెర్నాండో,పెరీరా, మురళీధరన్ కు రెండేసి వికెట్లు లభించాయి.
ఆట మొదటి రోజు 9వికెట్లు కోల్పోయి 274 పరుగులు చేసిన శ్రీలంక గురువారం ఆట ప్రారంభంలోనే చివరివికెట్ కోల్పోయింది. హర్వీందర్ సింగ్ వేసిన యార్కర్ కు చాముండా వాస్ అవుటయ్యాడు. దీనితో 274 పరుగులకు శ్రీలంక ఆలౌట్‌అయింది. ఆ తరువాత బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ మొదటి నుంచి కష్టాల్లో పడింది. చాముండా వాస్ భారత్ వెన్ను విరిచాడు. దాస్ ను 8 పరుగులకు, వైస్ కెప్టెన్ రాహుల్ ద్రావిడ్ ను 15 పరుగులకు వాస్ ఎల్.బి.డబ్ల్యూ. గా అవుటు చేశాడు. కష్టాల్లో వున్న భారత్ జట్టును అదుకుంటాడనుకున్న కెప్టెన్ సౌరభ్ గంగూలీ కూడా యధాలాపంగా షాట్ కొట్టి 18 పరుగులకు అవుటయ్యాడు. లంచ్‌విరామ సమయానికి భారత్ మూడు వికెట్లు కోల్పోయి 90 పరుగులు చేసింది.
ఆ తరువాత నిలకడగా ఆడుతున్న మహ్మద్ ఖైఫ్ ఫెర్నాండో వేసిన చక్కని బంతికి అవుటయ్యాడు. ఖైఫ్ 17 పరుగులు చేశాడు. 47 పరుగుల వద్ద ఓపెనర్ రమేష్ కూడా అవుటవ్వడంతో భారత్ ఆశలు దాదాపు కుప్పకూలాయి. ఫెర్నాండో బౌలింగ్ లో సంగకార క్యాచ్ పట్టగా రమేష్‌పెవిలియన్ చేరాడు. ఆ తరువాత 17 పరుగుల వద్ద హేమాంగ్ బదానీ కూడాపెరీరా బౌలింగ్ లో అవుటయ్యాడు. ఈ దశలో బ్యాటింగ్ కు వచ్చిన హర్భజన్ టీవిరామం తరువాత బ్యాట్ ఝళిపించాడు. 9 ఫోర్లతో 32 బంతుల్లో 44 పరుగులు చేశాడు. భారత్ ఈ మాత్రం గౌరవప్రదమైన స్కోరు సాధించిందంటే హర్భజన్‌చలవే.
శ్రీలంక రెండో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్సింగ్స్‌లో ఒకవికెట్ కోల్పోయి 52 పరుగులు చేసింది. శ్రీలంక కెప్టెన్ సనత్ జయసూర్య జహీర్‌ఖాన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. జయసూర్య ఆరు పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు.ఇరవై పరుగుల వద్ద జయసూర్య వికెట్ కోల్పోయిన శ్రీలంక మరో 32 పరుగులు జోడించింది. ఆటపట్టు 30 పరుగులతో, సంగరక్క 13 పరుగులతో క్రీజ్‌లో వున్నారు. భారత్ మొదటి ఇన్సింగ్స్ స్కోరుపై శ్రీలంక 94 పరుగుల ఆధిక్యతను సాధించింది.












Click it and Unblock the Notifications