ఐఐఐటికి డీమ్డ్ వర్సిటిగా గుర్తింపు
హైదరాబాద్‌ః హైదరాబాద్‌లో మూడేళ్ల క్రితం ఏర్పాటయిన ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ(ఐఐఐటి)కి డీమ్డ్ యూనివర్సిటీగా గుర్తింపు లభించింది.
దీని వల్ల బోధన, పరిశోధనల్లో సంస్థ సొంతగా చొరవతీసుకుని ముందుకు దూసుకుపోయే అవకాశం ఏర్పడింది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక చొరవ కారణంగా ఐఐఐటి హైదరాబాద్‌లో ఏర్పాటయిన విషయం విదితమే. ఇప్పటివరకు కేవలం ఐటి విద్యపైనే దృష్టి సారిస్తున్న ఈ సంస్థ ఇకముందు ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ హార్డ్‌వేర్, కమ్యూనికేషన్స్ వంటి రంగాల్లో కూడా ప్రత్యేక కోర్సులను ప్రవేశపెట్టే అవకాశం వున్నది.












Click it and Unblock the Notifications