పట్టుకుంటే అయిదు లక్షలు
హైదరాబాద్‌ః కృషి బ్యాంకు చైర్మన్ కొసరాజు వెంకటేశ్వరరావును పట్టుకోవడానిి పదిహేను రోజులుగా నానా తంటాలు పడుతున్న రాష్ట్ర పోలీసు శాఖ ఆయన్ను పట్టించిన వారికి లేదా ఆయన గురించిన సమాచారం తెలియజేసిన వారికి అయిదు లక్షల రూపాయల నగదు బహుమతి ప్రకటించింది.
కృషి బ్యాంక్ డిపాజిటర్లను మోసగించిన చైర్మన్‌తో పాటు పది మంది బ్యాంకు డైరెక్టర్లపై కూడా ప్రభుత్వంఅయిదేసి లక్షల రూపాయల చొప్పున రివార్డును ప్రకటించింది. కాగా బ్యాంకు వైస్ చైర్మన్, వెంకటేశ్వరరావు సోదరుడు వేణుగోపాలరావు బుధవారం నాడు పోలీసుల ముందు లొంగిపోయాడు. తనకేమీ తెలియదని తన అన్నయ్య వుండమంటే బ్యాంకు వైస్ చైర్మన్‌గా వున్నానని వేణుగోపాలరావు పోలీసులులకు చెప్పుకున్నాడు.












Click it and Unblock the Notifications