బీహార్ లో వార్ పంజా-ఆరుగురి ఊచకోత
పాట్నాః బీహార్ లోపీపుల్స్ వార్ గ్రూప్ నక్సలైట్లు మరోసారి దళితులను ఊచకోతకోశారు. దాస్ మాయ్ గ్రామంపై బుధవారం రాత్రి నక్సలైట్లువిరుచుకు పడి ఆరుగురిని నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపారు.
వారం రోజుల కిందట కూడా నక్సలైట్లు ఇటువంటి ఊచకోతకే పాల్పడ్డారు. మావోయిస్టు కమ్యూనిస్టుసెంటర్ సానుభూతి పరులను పోలీసులు ఇటీవల కాల్చి చంపినందుకు నిరసనగా జయనందన్ యాదవ్ దళం ఈ ఘాతుకానికి పాల్పడిందని భావిస్తున్నారు. ఈ సంఘటన పాట్నా జిల్లా ధన్ రావ్ పోలీస్టేషన్ పరిధిసోని దాస్ మాయ్ గ్రామంలో జరిగింది.
నక్సలైట్ల దుశ్చర్య గురించి తెలిసిన వెంటనే పోలీసు బలగాలు హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టాయి.












Click it and Unblock the Notifications
