ఇరాన్ డీల్ తో కుప్పకూలిన చమురు ధరలు..! అయినా ట్రంప్ కు వీడని కష్టాలు..!
అమెరికా -ఇరాన్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందం పశ్చిమాసియాతో పాటు అంతర్జాతీయంగా పలు లెక్కలు మారుస్తోంది. ఐదు నెలులుగా సాగిన యుద్దం ముగిసిపోవడంతో ప్రపంచ దేశాలు ఊపిరి పీల్చుకుంటున్నాయి. అదే సమయంలో వారికి మరో గుడ్ న్యూస్ కూడా అందింది. యుద్దం కారణంగా పెరిగిన చమురు ధరలు (crude oil) దిగొస్తున్నాయి. అదీ యుద్దం మొదలైన తర్వాత కనిష్ట స్దాయికి చేరుకుంటున్నాయి. దీంతో భారత్ సహా పలు దేశాలకు ఊరట లభిస్తోంది.
కనిష్ట స్థాయికి క్రూడాయిల్ ధర (Crude)
అమెరికా-ఇరాన్ మధ్య మధ్య కుదిరిన ఈ తాత్కాలిక ఒప్పందంతో అంతర్జాతీయ మార్కెట్‌లో బిగ్ రిలీఫ్ లభించింది. వ్యూహాత్మక హార్ముజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలు పునఃప్రారంభం కావడంతో బ్రెంట్ క్రూడ్ ధర యుద్ధం ప్రారంభమైన తర్వాత మొదటిసారిగా 75 డాలర్ల కంటే దిగువకు పడిపోయింది. ఈ జలసంధి గుండా వెళ్లే నౌకలపై ఎలాంటి సుంకాలు వసూలు చేయబోమని ఇరాన్ హామీ ఇవ్వడం దీనికి మరో కారణం.

అమెరికా-ఇరాన్ పరస్పర ప్రశంసలు
హార్ముజ్ లో నౌకలపై సుంకాలు వసూలు చేయబోమన్న హామీపై అమెరికా సంతోషం వ్యక్తం చేస్తోంది. అలాగే ఇరాన్ కూడా ఎట్టకేలకు ఈ ఒప్పందం కుదరడంతో తిరిగి సాధారణ స్ధితికి చేరుకునందుకు ప్రయత్నిస్తోంది. అయితే హార్ముజ్ జలసంధిపై ఏ ఒక్క దేశానికీ పూర్తి నియంత్రణ ఉండకూడదని ఖతార్ ప్రధాని షేక్ మహ్మద్ బిన్ అబ్దుల్‌రహ్మాన్ చెప్తున్నారు. నౌకల భద్రత కోసం అమెరికా, ఇరాన్ మధ్య ఏర్పాటు చేసిన హాట్‌లైన్ సత్ఫలితాలను ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే తమ దేశ ఎల్‌ఎన్‌జీ (LNG) ఉత్పత్తి సాధారణ స్థితికి చేరుకుంటుందని ఆయన తెలిపారు.

స్వదేశంలో ట్రంప్‌కు ఎదురుదెబ్బ
మరోవైపు, ఇరాన్‌తో దౌత్యపరమైన డీల్ కుదుర్చుకున్న తరుణంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అమెరికా సెనేట్‌లో చుక్కెదురైంది. కాంగ్రెస్ అనుమతి లేకుండా ఇరాన్‌పై ఎలాంటి తదుపరి సైనిక చర్యలు తీసుకోకుండా నిరోధించే బిల్లుకు సెనేట్ 50-48 ఓట్ల తేడాతో ఆమోదం తెలిపింది. దీనిపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఇరాన్ ఇప్పటికే బలహీనపడిందని, సెనేటర్లు తన పనిని మరింత క్లిష్టం చేశారని మండిపడ్డారు. అయితే, ఈ ఇరాన్ యుద్ధం కారణంగా జరిగిన నష్టానికి ఈ ఒప్పందం సరైన పరిష్కారం కాదని మెజారిటీ అమెరికన్లు భావిస్తున్నట్లు ఇటీవలి సర్వేలు చెబుతున్నాయి. ఐక్యరాజ్యసమితి అణు పర్యవేక్షణ సంస్థ (IAEA) ఇరాన్ అణు కేంద్రాల తనిఖీలను పునఃప్రారంభించేందుకు సిద్ధమవుతుండగా, ఇరాన్ తన పాత అణు కార్యక్రమాలను పూర్తిగా విరమించుకుంటుందనే నమ్మకం లేదని ఇజ్రాయెల్ విమర్శిస్తోంది.














Click it and Unblock the Notifications