అమెరికాకు భారత్ రెడ్ లైన్.. ! జైశంకర్ సీరియస్ వార్నింగ్..!

భారత్ ఎదుర్కొంటున్న ఉగ్రవాద సమస్యను లైట్ తీసుకుంటున్న అమెరికాపై ఇవాళ కేంద్రం సీరియస్ అయింది. ముఖ్యంగా పాకిస్తాన్ నుంచి తాము ఎదుర్కొంటున్న ఉగ్రవాద ముప్పుపై అమెరికా తీవ్రంగా స్పందించకపోవడంపై, చర్యలు తీసుకోకుండా వారితో స్నేహం చేయడంపై విదేశాంగమంత్రి జై శంకర్ (Jaishankar) ఇవాళ కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశ ఆందోళనల్ని పట్టించుకోకపోతే.. అమెరికాతో బంధంపై ప్రభావం పడుతుందని జై శంకర్ హెచ్చరికలు జారీ చేశారు. దీంతో భారత్-అమెరికా సంబంధాలపై మరోసారి చర్చ మొదలైంది.

OneIndia Exclusive: మోడీ-షా ప్లే బుక్ వ్యూహం- బయటపెట్టిన టీఎంసీ ఎంపీ..!
OneIndia Exclusive: మోడీ-షా ప్లే బుక్ వ్యూహం- బయటపెట్టిన టీఎంసీ ఎంపీ..!

భారత్ తన మిత్రదేశం ఏం చేస్తోంది, ఎవరితో సంప్రదింపులు జరుపుతోంది అనే విషయాలను తెలుసుకోవడం ఎందుకు ముఖ్యమో విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ఇవాళ చాలా సూటిగా ప్రస్తావించారు. భారత్-అమెరికా సంబంధాలు మరియు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సాగుతున్న పోరాటం నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు వెలువడ్డాయి. భారత్-అమెరికా వాణిజ్య సమస్యలు, సుంకాలకు సంబంధించిన వివాదాస్పద అంశాలపై మాట్లాడిన తర్వాత, జైశంకర్ ద్వైపాక్షిక సంబంధాలపై కొంతమేర ప్రభావం చూపే మరో ముఖ్యమైన అంశం గురించి స్పందించారు. అదే తీవ్రవాదం. దశాబ్దాలుగా భారత్ తీవ్రవాద బాధిత దేశంగా ఉంది. అయినా అమెరికాకు సానుభూతి లేకపోవడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

Jaishankar Draws Red Line on Terrorism Says India-US Ties Could Be Affected
అరేబియా సముద్రానికి ఇరాన్ వార్..! ట్రంప్ కు ఖమేనీ ఘాటు వార్నింగ్..!
అరేబియా సముద్రానికి ఇరాన్ వార్..! ట్రంప్ కు ఖమేనీ ఘాటు వార్నింగ్..!

భారతదేశానికి అత్యంత కీలకమైన అంశం ఉగ్రవాదమని, అనేక దశాబ్దాలుగా ఒక పొరుగు దేశం ఉద్దేశపూర్వకంగా తమపై ప్రయోగించినటువంటి ఉగ్రవాదాన్ని ఎదుర్కొన్న దేశాలు చాలా తక్కువని భావిస్తున్నామని జైశంకర్ తెలిపారు. ఉగ్రవాదం విషయంలో భారతదేశ ఆందోళనలను గుర్తించడానికి లేదా అర్థం చేసుకోవడానికి నిరాకరించే భాగస్వామ్య దేశం, ఖచ్చితంగా ద్వైపాక్షిక సంబంధాలపై ప్రభావం చూపుతుందని విదేశాంగ మంత్రి జైశంకర్ స్పష్టం చేశారు. మనకు ఇంతగా ముఖ్యమైన విషయం పట్ల మిత్రదేశానికి తగినంత అవగాహన లేదా సానుభూతి లేకపోతే, అది కూడా ఒక సమస్యను సృష్టిస్తుందని భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్ననారు. అమెరికాలో జరుగుతున్న పరిణామాలు కూడా దీనిపై కనీసం ప్రభావం చూపుతున్నాయని భావిస్తున్నట్లు తెలిపారు. అమెరికాలోని దేశీయ సమస్యలు, భారత్‌తో సహా అంతర్జాతీయ సమాజంతో ఆ దేశ నాయకులు వ్యవహరించే తీరును ప్రభావితం చేస్తున్నాయని ఆయన తెలిపారు. అయితే అమెరికా తన విధానాల అమలులో తరచుగా కలిసి పనిచేయడానికి అనుకూలంగా భావించే పాకిస్థాన్ పేరును ఆయన నేరుగా ప్రస్తావించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+