రోకలి బండతో ఒకరు, గొడ్డలితో మరొకరు.. భార్యల చేతిలో భర్తల మృతి!
ఇటీవల కాలంలో భర్తలను భార్యలు హత మారుస్తున్న ఘటనలు నిత్యకృత్యంగా మారిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ చూసినా అత్యంత దారుణంగా భార్యలు భర్తలను హత మారుస్తున్నారు. తాజాగా మరో రెండు దారులు ఘటనలు మహిళలలో పెరుగుతున్న క్రూర ప్రవృత్తికి అద్దం పడుతున్నాయి.
మంచిర్యాల పట్టణంలోని అశోక్ రోడ్ లో youtube ఛానల్ లో రిపోర్టర్ గా పనిచేస్తున్న 40 సంవత్సరాల వైద్య మోహన్ అనే వ్యక్తిని, అతని భార్య రోకలిబండతో కొట్టి అత్యంత దారుణంగా హతమార్చింది. భార్యపై అనుమానం పెంచుకున్న వైద్య మోహన్ ఆమెను నిత్యం వేధింపులకు గురి చేయగా, సహనం నశించిన ఆమె రోకలి బండతో భర్త పైన దాడి చేసింది.

ఈ దాడిలో భర్త అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాలు హత్యకు కారణమని పోలీసులు నిర్ధారించారు. తనను అనుమానంతో నిత్యం వేధిస్తున్న కారణంగానే భర్తను రోకలి బండతో కొట్టి చంపానని భార్య అంగీకరించినట్లుగా తెలుస్తోంది.
ఇక మరొక కేసులో భర్తను గొడ్డలితో నరికి చంపింది ఓ ఇల్లాలు. హైదరాబాద్లోని ఆల్వాల్ పోలీస్ స్టేషన్ ఈ దారుణ ఘటనలో కుమార్తె పట్ల అసభ్యంగా ప్రవర్తించిన క్రమంలోనే భార్య భర్తను గొడ్డలితో నరికి చంపినట్టుగా తెలుస్తోంది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం పెద్ది పద్మా రెడ్డి కాలనీలో నివాసం ఉంటున్న శ్రీనివాస్ అనే వ్యక్తి తన కుమార్తెతో అసభ్యంగా ప్రవర్తించాడు.
కూతురితో అసభ్యంగా ప్రవర్తిస్తున్న భర్తను అడ్డుకునే క్రమంలో భార్య రమాదేవి అతనిపైన గొడ్డలితో దాడి చేసింది. ఈ దాడిలో అతను సంఘటన స్థలంలోని ప్రాణాలు విడిచాడు కేసు నమోదు చేసిన పోలీసులు ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు రాబట్టే పనిలో ఉన్నారు. హత్యకు ఆమె ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. కారణాలు ఏవైనా మహిళలు గతానికి భిన్నంగా నేరాలకు పాల్పడటం ఆందోళన కలిగిస్తుంది. ఈ పరిణామాలు మహిళలలోనూ సహనం నశిస్తుంది అని చెప్పేలా చేస్తుంది.













Click it and Unblock the Notifications
