జాక్ పాట్ కొట్టిన శ్రీచరణి.. !!
ఐసీసీ తాజాగా విడుదల చేసిన మహిళల టీ20 బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో భారత ఎడంచేతి వాటం స్పిన్నర్ శ్రీచరణి సరికొత్త రికార్డు సృష్టించారు. ఆమె ఏకంగా 817 రేటింగ్ పాయింట్లు సాధించారు. అత్యధిక రేటింగ్ పాయింట్లు సాధించిన మహిళా బౌలర్‌గా నిలిచారు. ఓ మహిళ బౌలర్ ఈ స్థాయిలో రేటింగ్ పాయింట్లను సాధించడం 2018 నవంబర్ తర్వాత ఇదే మొదటిసారి. అప్పట్లో ఆస్ట్రేలియాకు చెందిన పేస్ బౌలర్ మేగాన్ షట్ 806 పాయింట్లు అందుకున్నారు. దాన్ని శ్రీచరణి తుడిచిపెట్టేశారు. నూతన రికార్డును నెలకొల్పారు.
శ్రీచరణితో పాటు టీమిండియా వైస్ కెప్టెన్, స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన కూడా ఐసీసీ మహిళల టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో టాప్ 5 లోకి దూసుకొచ్చారు. ఆసియా గేమ్స్ ఫైనల్‌లో శ్రీలంకపై భారత జట్టు సాధించిన విజయం.. ఈ ఇద్దరు ప్లేయర్ల ర్యాంకులను శిఖరాగ్రానికి చేర్చింది. నాటి మ్యాచ్ లో శ్రీచరణి 13 పరుగులు ఇచ్చి 2 వికెట్లు పడగొట్టారు. శ్రీలంకను కట్టడి చేశారు. బ్యాటింగ్‌లో స్మృతి మంధాన 46 బంతుల్లో 7 సిక్సర్లు, 5 ఫోర్లతో విధ్వంసకర రీతిలో 79 పరుగులు సాధించారు.

ఆసియా గేమ్స్ ఫైనల్ లో భారత్ 147 పరుగుల భారీ తేడాతో శ్రీలంకను ఓడించి బంగారు పతకాన్ని నిలబెట్టుకుంది. ఇదే మ్యాచ్‌లో మెరుపు వేగంతో బ్యాటింగ్ చేశారు రిచా ఘోష్. 22 బంతుల్లో 49 పరుగులతో అజేయంగా నిలిచారు. ఈ ప్రదర్శన సహాయంతో ఆమె తన ఐసీసీ ర్యాంకింగ్స్ ను మెరుగుపర్చుకున్నారు. మూడు స్థానాలు ఎగబాకి టీ20 బ్యాటింగ్ విభాగంలో 25వ స్థానానికి చేరుకున్నారు. బౌలింగ్ విభాగంలో భారత్‌కు చెందిన క్రాంతి గౌడ్ కూడా నాలుగు స్థానాలు మెరుగుపరుచుకుని 53వ స్థానానికి చేరారు.
ఆసియా గేమ్స్ లో కాంస్య పతకం కోసం జరిగిన మ్యాచ్ లో బంగ్లాదేశ్‌పై పాకిస్తాన్ 31 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో 30 బంతుల్లో 45 పరుగులు చేసిన కెప్టెన్ ఫాతిమా సనా రేటింగ్స్‌లో 23వ స్థానానికి ఎగబాకారు. అలీయా రియాజ్ 64, గుల్ ఫెరోజా 87వ స్థానానికి చేరారు. బంగ్లాదేశ్ ప్లేయర్ షర్మిన్ అఖ్తర్ 10 స్థానాలు మెరుగుపరుచుకుని 35వ ర్యాంకు సాధించారు. బౌలింగ్‌లో పాక్ బౌలర్ నష్రా సంధు, హనీ 51, బంగ్లాదేశ్ బౌలర్ నహిదా అఖ్తర్ 29వ స్థానానికి దూసుకెళ్లారు.
ఐసీసీ మహిళల వన్డే క్రికెట్ విభాగంలో చూస్తే, వెస్టిండీస్ కెప్టెన్ హేలీ మాథ్యూస్ జింబాబ్వేపై కెరీర్ బెస్ట్ 182 పరుగులు చేసి బ్యాటర్ల జాబితాలో నాలుగో స్థానానికి చేరుకున్నారు. అదే సిరీస్‌లో రాణించిన జింబాబ్వే కెప్టెన్ మోడెస్టర్ ముపాచిక్వా 16 స్థానాలు మెరుగుపరుచుకుని 40వ స్థానానికి ఎగబాకింది.













Click it and Unblock the Notifications
